చెరకు ధర్మరాజు జయంతి సందర్భంగా జోన్ 2 ఎంవిపి వాసవి క్లబ్ కపుల్స్ ఆధ్వర్యంలో నిరాశ్రయులను వయోవృద్ధులకు అల్పాహారం ఏర్పాటు.

జై వాసవి...జై జై వాసవి విశాఖ సిటీ, ప్రజా బలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ. వి 201ఏ లో రీజియన్ 2, జోన్ 2 నందు గల వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో టి ఎస్ ఆర్ కాంప్లెక్స్ నందు ఏ యు టి డి, జీవీఎంసీ నిర్వహణలో నడుస్తున్న నిరాశ్రయుల వసతి గృహమందు ఉన్న వయో వృద్ధులకు తేదీ 18.01.2026 ఆదివారం నాడు ఉదయం 7 గంటలకు కీర్తిశేషులు శ్రీ చెరుకు ధర్మరాజు గారి జయంతి సందర్భంగా వారి శ్రీమతి సతీమణి సునీత, కుమారుడు క్రిష్ణ మూర్తి, కోడలు అపర్ణ గార్ల ఆర్ధిక సహాయం తో అల్పాహారం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో క్లబ్ చార్టర్ అధ్యక్షులు మరియు క్యాబినెట్ కోశాధికారి చెరుకు కృష్ణ మరియు పూర్వపు అధ్యక్షులు వాసవియన్ గ్రంధి కృష్ణారావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏ యు టి డి సిబ్బంది దాతలకు ధన్యవాదములు తెలిపినారు.