ఎంవిపి వాసవి క్లబ్ కపుల్స్ ఆధ్వర్యంలో ఎక్స్ అధ్యక్షులు జోన్ చైర్పర్సన్ ఏవి రామకృష్ణారావు ఎండాడలో ఘనంగా భోగి సంక్రాంతిపండగ, గంగిరెడ్లను ఆడించి ఆటపాటలతో అలరింపజేసి వస్త్ర దానం చేసిన రామకృష్ణారావు దంపతులు.
January 14, 2026
జై వాసవి...
విశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ :( సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో
తేదీ 14.01.2026 బుధవారం నాడు భోగి పండుగను పురస్కరించుకొని వైశాఖి స్కై పార్క్ నందు భోగి మంట వేసిన ప్రాంగణము వద్ద గంగిరెద్దులను తీసుకువచ్చి ఆడించిన వ్యక్తులకు, కీర్తనలు పాడుతూ అలరిపచేసిన హరిదాసు నకు వస్త్రధానములో భాగంగా దుప్పట్లు , పండ్లు పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పూర్వపు అధ్యక్షులు, జోన్ చైర్ పర్సన్ వెంకట రామకృష్ణారావు క్లబ్ సభ్యులు వాసవియన్ నాగవేణి ఇతర సభ్యులు పాల్గొన్నారు.

