వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వి201 ఏ విశాఖ జిల్లా రీజియన్ 2, జోన్ 2, ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో వసంత పంచమి సరస్వతి దేవి జన్మదినం సందర్భంగా రైల్వే న్యూ కాలనీ ప్రభుత్వహైస్కూల్లో జిల్లా గవర్నర్ వాసవియన్ సాయినిర్మల, క్లబ్ అధ్యక్షులు వాసవి ఎన్ వెంకట రమణమూర్తి టీం సభ్యులు సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు చేసి 400 మంది విద్యార్థులకు స్వీట్స్ అందజేశారు..

విశాఖ సిటీ,ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ)
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వి 201 ఏ విశాఖపట్నం జిల్లా, రీజియన్ 2,జోన్ 2, వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో వసంత పంచమి, సరస్వతి దేవి జన్మదినం ను పురస్కరించుకొని రైల్వే న్యూ కాలనీ లో గల ప్రభుత్వ హై స్కూల్ నందు జిల్లా గవర్నర్ వాసవియన్ సాయి నిర్మల గారు సరస్వతి దేవి విగ్రహానికి క్లబ్ అధ్యక్షులు వాసవియన్ వెంకటరమణమూర్తి మరియు టీమ్ సభ్యుల సమక్షం లో అత్యంత వైభవంగా పూజలు నిర్వహించారు. వసంత పంచమి యొక్క విశిష్టతను, సరస్వతి దేవి జన్మదినం యొక్క ప్రాముఖ్యతను ప్రిన్సిపాల్ మేడం మీనాక్షి గారు వివరించినారు. ఎన్ సీ సీ శిక్షకులు ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ఈ మన హై స్కూల్ నందు 2015 లో సరస్వతి దేవి విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రతి సంవత్సరం పూజలు నిర్వహిస్తూ విద్యార్థిని విద్యార్థులకు మిఠాయిలు పంచిపెడుతున్నారని మరియు వాసవి క్లబ్, ఏం.వి.పి. కపుల్స్ వారు ఈ హైస్కూల్ కు ఎంతో సహకారం అందిస్తున్నారని కొనియాడారు. ఇకముందు కూడా అదే విధంగా సహాయ సహకారములు అందించాలని కోరారు. ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమం మా హైస్కూల్ నందు నిర్వహించడం చాలా ఆనందదాయకమని పలువురు ఉపాధ్యాయులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ధన్యవాదములు తెలిపినారు.400 మంది విద్యార్థిని, విద్యార్థులు కు , టీచర్స్ కు, స్కూలు సిబ్బంది కి స్వీట్ అండ్ హాట్ పాకెట్స్ క్లబ్ వారు అందచేసిరి. ఈ కార్యక్రమంలో క్యాబినెట్ ప్రధాన కార్యదర్శి పద్మావతి, సేవా విభాగపు కార్యదర్శి రమణి, క్యాబినెట్ కోశాధికారి చెరుకు కృష్ణ, రీజియన్ 2 చైర్ పర్సన్ మానస ,(పద్మావతి), క్లబ్బు ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గుప్త, క్లబ్ కోశాధికారి చెరుకూరి నర్సింగరావు, కార్యక్రమాల అధ్యక్షులు శివరామకృష్ణ మరియు గ్రంధి వాసుదేవ మూర్తి, చెరుకు శ్రీరామమూర్తి, జోన్ 2 చైర్ పర్సన్ వెంకట రామకృష్ణారావు, పూర్వపు అధ్యక్షులు వాసవియన్ గోగుల నర్సింగరావు, గ్రంధి కృష్ణారావు మరియు క్లబ్ సభ్యులు మోహన్ రావు, దేవి లు పాల్గొన్నారు.