వాసవి క్లబ్ జోన్ టు ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో మత్స్యకారులు కాలనీలో వాసవి ఎన్ గోగుల నర్సింగరావు నివాస ప్రాంగణంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.

విశాఖ సిటీ(,ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) ఇంటర్నేషనల్, విశాఖపట్నం జిల్లా వి201ఏ, జోన్ 2 వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో తేదీ 26.01.2026 సోమవారం ఉదయం 8 గంటలకు స్థానిక ఎంవీపీ సెక్టార్ 9 ,మత్స్యకారుల కాలనీ నందు నివాసం ఉంటున్న పూర్వపు అధ్యక్షులు వాసవియన్ గోగుల నర్సింగరావు గారి గృహ ప్రాంగణం నందు గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా రిపబ్లిక్ డే దినోత్సవం వేడుకలు చేస్తున్న తరుణంలో ఈ సంవత్సరం కూడా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. క్లబ్బు చార్టర్ అధ్యక్షులు, క్యాబినెట్ కోశాధికారి వాసవియన్ చెరుకు కృష్ణ గారు జండా వందనం సమర్పించగా, క్లబ్ అధ్యక్షులు వాసవియన్ వెంకటరమణమూర్తి గారు రిపబ్లిక్ డే దినోత్సవము యొక్క ప్రాసస్యత గురించి సందేశ రూపంలో వివరించినారు. తదనంతరం ఆ ప్రాంతంలో నివసిస్తున్న గృహస్తులు యొక్క చిన్నపిల్లలకు నోట్ బుక్స్, బిస్కెట్ ప్యాకెట్స్, చాక్లెట్స్ పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమములో వాసవియన్స్ క్లబ్బు ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గుప్తా, కోశాధికారి చెరుకూరి నరసింహారావు, కార్యక్రమాల అధ్యక్షులు శివరామకృష్ణ ,జోన్ 2 చైర్పర్సన్ వాసవియన్ వెంకట రామకృష్ణారావు, పూర్వపద్యక్షులు గ్రంధి కృష్ణారావు, మల్లేశ్వర గుప్తా, సన్యాసి రాజు,సభ్యులు సత్యవేణి, వాసు, నీలిమ పాల్గొన్నారు.