మహా శివుని సేవలో వాసవి క్లబ్ , శివ భక్తులకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వి 201 ఏ జోన్ టు ఆధ్వర్యంలో వాసవి క్లబ్ కంచరపాలెం విశ్వ వాసవి, అమృత వాసవి సంయుక్తంగా వెయ్యి మందికి పులిహార వితరణ .

విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) జై వాసవి ..జై జై వాసవి... తేదీ 12.02.2026 ఆదివారం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, వి 201 ఏ, జోన్ 2 నందు గల వాసవి క్లబ్ కంచరపాలెం ఆధ్వర్యంలో (విశ్వ వాసవి, అమృత వాసవి సామూహికంగా) ఒకటవ పట్టణ పరిధిలోగల శివాలయం నందు మహాశివరాత్రి సందర్భంగా దర్శనార్థం వచ్చిన 1000 మంది భక్తులకు పులిహోర ప్రసాద వితరణ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు వాసవియన్ నాగేశ్వరరావు , ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు, కోశాధికారి మీనాక్షి మరియు క్లబ్ సభ్యులు చంద్రమౌళి గారు పాల్గొన్నారు.