విశాఖ రామకృష్ణ బీచ్ లో విశాఖ జిల్లా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వీర జవాన్లకు విశాఖ జిల్లా v201 ఏ. గవర్నర్ వంకాయల సాయి నిర్మల నాయకత్వంలో పుల్వామా దాడిలో మృతి చెందిన 40 మంది వీర జవాన్లకు ప్లకార్డులు ప్రదర్శన చేసి ఘన నివాళులర్పించారు అమరవీరులకు జోహార్లర్పిస్తు .. పాండురంగ స్వామి దేవాలయం నుండి విక్టరీ ఎట్ సి టవర్ వరకు భారత్ మాతాకీ జై, జై జవాన్ జై కిసాన్ అన్న నినాదాలతో హోరెత్తించారు.

అమర జవానులకు ఘన నివాళులు (విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) తేదీ 14.02.2026 శనివారం ఉదయం 6 గంటలకు ఫిబ్రవరి 14 , 2019 పుల్వామా దాడి లో పరమపదించిన 40 మంది వీర జవాన్లు కు అంతర్జాతీయ వాసవి క్లబ్, జిల్లా వి201ఏ గవర్నర్ వంకాయల సాయి నిర్మల ఆధ్వర్యం లో ప్రాంతీయ ఛైర్పర్సన్ పచికోళ్ళ సతీష్ నేతృత్వంలో పాండురంగ స్వామి దేవాలయం నుండి బీచ్ రోడ్ లో గల "*విక్టరీ ఎట్ సి*" టవర్ వరకు "*అమర వీరులకు జోహార్ జోహార్* అని జోహార్లుపలుకుతూ " "*భారత్ మాత కు జై*" "*జై జవాన్ - జై కిసాన్*" అంటూ నినాదాలు చేస్తూ సుమారు 300 మంది కి పైగా *ప్ల కార్డులు* తో *విక్టరీ ఎట్ సి* వద్ద వీర అమర జవానులకు ఘన నివాళులర్పించారు. అనంతరం భారత దేశ సైన్యం లో పని చేసి విశ్రాంతి పొందుతున్న పలువురి జవాన్లకుసన్మానం చేశారు.సన్మాన గ్రహీతులైన గ్రంధి రామ కార్తీక్, నరేంద్రనాద్ చౌదరి డాక్టర్ శివాజీ , తవ్వా సంజీవ రావు భాస్కర రావు గార్లు వాసవి క్లబ్ చేపట్టిన ఈ కార్యక్రమానికి అభినందనలు తెలుపుతూ దేశ ఆర్థిక పురోగ్రతికి మూల స్తంభాలు ఆర్య వైశ్యులు అని అలాగే వారి బిడ్డలను కూడా దేశ సేవకై ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు క్లబ్ అధ్యక్ష, కార్యదర్శి,కోశాధికార్లతో పాటు అధిక సంఖ్యలో సభ్యులు అంతర్జాతీయ అధికారులు ప్రభాకర్,కీర్తన, అమర్నాథ్, మధుసూదన్ ,జిల్లా అధికారులు పద్మావతి,చెరుకు కృష్ణ,రమణి, వాసుదేవ మూర్తి, ఏ.వి.రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.