భీమిలి లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం. పార్టీ బలోపేతానికి కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలి - భీమిలి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి చిన్న శ్రీను పిలుపు. కష్టపడి పని చేసే కార్యకర్తలకు వైసీపీలో తగినగుర్తింపు.
February 09, 2026
భీమిలిలో వైఎస్ఆర్సిపి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం: పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి. భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త ‘చిన్న శ్రీను’ పిలుపు..
భీమిలి నియోజకవర్గం, (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ.)
భీమిలి నియోజకవర్గం, చిట్టివలస గ్రామంలో శ్రీ లక్ష్మీ శ్రీనివాస కళ్యాణ మండపం నందు జీవీఎంసీ 1,2,3,4 వార్డుల వైఎస్ఆర్సిపి విస్తృత స్థాయి సమావేశం జగ్గుబిల్లి ప్రసాద్ గారు అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా *విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను)గారు హాజరయ్యారు* వారితో పాటు విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షులు కేకే రాజు గారు, ఎమ్మెల్సీ కుంబా రవిబాబు గారు, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ గారు, చిన్న శ్రీను
గారి కుమార్తె శ్రీ సహస్ర(సిరిమ్మ)గారు, కో ఆప్షన్ నెంబర్ సేనాపతి అప్పారావు గారు, జోనల్ యువజన విభాగ అధ్యక్షులు అంబటి శైలేష్ గారు తదితరులు పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా శ్రీ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ..
వార్డు కమిటీలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ప్రజల దృష్టిని మళ్లించేందుకు 'డైవర్షన్ పాలిటిక్స్' చేస్తోందని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో...
నాలుగు వార్డుల అధ్యక్షులు జగ్గుబిల్లి ప్రసాదు, భాస్కర్ రెడ్డి గారు, నరసింగరావు గారు,రాంబాబు గారు కార్పొరేటర్ అక్రమాన్ని రామ్ నాయుడు గారు, రమణారెడ్డి గారు, వెంకటరెడ్డి గారు,రాంబాబు గారు, హరి కిరణ్ గారు, మధు, ఎల్లాజీ, ఈశ్వర్ రెడ్డి, వంశీ , షణ్ముఖరావు ,వెంకటేష్ , సత్యనారాయణ , వెంకటేష్ గారు, మంగరాజు గారు, ప్రభాకర్ నాయుడు, ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
