ప్రతి ఒక్కరు దేహంలోనూ పరమశివుడు కొలువై ఉంటాడు. చేసే పనులను బట్టి స్వర్గ ప్రాప్తి, నరక ప్రాప్తి -- విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ శంకు బ్రత బాగ్జి

*ప్రతి ఒక్కరిలోనూ పరమాత్మను చూడండి* *పరులకు ఎంతో కొంత సేవ చేయండి* *సేవా భావం కలిగిన వారికి నిరంతరం పరమశివుడు ఆశీస్సులు* *నగర్ పోలీస్ కమిషనర్ బాగ్చీ* విశాఖ సిటీ( ప్రజాబలం
న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )(డాబా గార్డెన్స్ ఫిబ్రవరి 13) సమాజంలో ప్రతి ఒక్కరిలోనూ పరమాత్మను చూడగలిగితే అటువంటి వ్యక్తులు ధన్యజీవులని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్గ్చి అన్నారు.. శుక్రవారం ఇక్కడ డాబా గార్డెన్స్ వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ప్రెస్ క్లబ్ లో ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు దేహంలోనూ ఆ పరమాత్ముడు కొలువై ఉంటారన్నారు. . చేసే పనులు బట్టి స్వర్గ ప్రాప్తి.. నరక ప్రాప్తి లభిస్తుందన్నారు.. కాబట్టి.. ప్రతి ఒక్కరూ అందుకు తగ్గట్లుగానే మంచి పనులతో ముందుకు సాగాలన్నారు. ఇతరులకు ఎంతో కొంత సహాయం చేయగలిగితే అటువంటి వారికి ఆ పరమశివుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు.. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ లేని విధంగా శివాలయాలు ఉన్నాయని అది మనమంతా అదృష్టంగా భావించాలన్నారు.. ప్రపంచవ్యాప్తంగా శివరాత్రి పర్వదినాన్ని ఎంత గొప్పగా జరుపుకుంటారని అటువంటి మహోన్నతమైన పరమేశ్వరుడు ఆశీస్సులు సర్వ మానవాళి పై ఉండాలని సిపి ఆకాంక్షించారు. గౌరవ అతిథిగా హాజరైన విశాఖ జిల్లా బిజెపి అధ్యక్షులు ఎం ఎం ఎన్ పరశురామరాజు మాట్లాడుతూ హిందూ సమాజంలో అందరూ సమానమే అన్నారు.. మహాశివరాత్రి పర్వ దినాన్ని ప్రతి ఒక్కరు ఆనందమయంగా జరుపుకోవాలని.. ఆ పరమ శివుడు ఆశీస్సులు అందరి పైన ఉండాలని పేర్కొన్నారు. పదిమందికి సేవ చేయడంతో పాటు పరమాత్ముడు మెచ్చేమంచి పనులు కూడా చేసినప్పుడు మన జన్మ సార్థకత అవుతుంది అన్నారు.. జనసేన పార్టీ నాయకులు. 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ఆ పరమశివుడు ఆశీస్సులతోనే తాను నిత్యం అనేక సేవా కార్యక్రమాలు చేపట్టగలుగుతున్నట్లు చెప్పారు.. త్వరలోనే దక్షిణ నియోజకవర్గం పరిధిలో నిరుపేదలకు సామూహిక వివాహాలు జరిపించనున్నట్లు చెప్పారు.. మంగళ సూత్రాలు నుంచి అన్ని ఖర్చులు తానే భరిస్తానన్నారు.. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు.. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ లోకమంతా జరుపుకునే పండుగ మహాశివరాత్రి అని అటువంటి పర్వదినంలో జర్నలిస్టులను కూడా భాగస్వాములను చేయడం ఎంతో సంతోషదాయకమన్నారు.. తన పరిధి మేరకు పదిమందికి సేవ చేయాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు.. కార్యక్రమ నిర్వాహకులు ప్రజాపిత బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం ప్రతినిధి బి కే రామేశ్వరీ మాట్లాడుతూ ప్రపంచమంతా ఆత్మ శక్తితోనే నడుస్తుంది అన్నారు. శివరాత్రి రోజు రాత్రి 12 గంటలకు లింగోద్భవం జరుగుతుందని భక్తులు ప్రగాఢ విశ్వాసంలో పరమశివుడు భూమి మీద అవతరిస్తారు అన్నారు. ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ పరమత సహనం కలిగి ఉండి మానవతా దృక్పథంతో దయ.. ప్రేమ .కరుణ కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా టీవీ టూరిజం డైరెక్టర్ మణిభూషణ్.. ఆదిత్య రూపకల్పన చేసిన పరమశివుడి ప్రత్యేకతతో కూడిన పాటను నగర పోలీస్ కమిషనర్ ఆవిష్కరించారు.. ఈ పాటను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించారు.. ఈ సందర్భంగా అతిథులందరికీ ప్రసాదాలు అందజేసి జ్ఞాపికలు బహుకరించారు.. ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ప్రతినిధులు సోమేశ్వరి.. లలిత.. రూప.. టూ టౌన్ సీఐ ఎర్రమనాయుడు.. ఎస్ఐ సంధ్య.. బ్రహ్మకుమారీలు తదితరులంతా పెద్ద ఎత్తున పాల్గొన్నారు