విజయనగరం ఎమ్ఆర్ సంగీత కళాశాల, రోడ్డు, రంజనీ థియేటర్ ఎదురుగా వెలసినఎల్లమాంబ అమ్మవారిని దర్శించుకున్న విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న శ్రీను సోల్జర్ అధ్యక్షురాలు సిరమ్మ..

ఎల్లమాంబ అమ్మవారిని దర్శించుకున్న విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, చిన్న శ్రీను సోల్జర్ అధ్యక్షురాలు సిరమ్మ. విజయనగరం ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ) విశాఖపట్నం విజయనగరం ఫిబ్రవరి 26: విజయనగరంలోని సంగీత కళాశాల ధరి, రంజనీ థియేటర్ ఎదురుగా వెంచేసియున్న శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ తల్లి మహోత్సవాల్లో భాగంగా శ్రీ ఎల్లమాంబా సేవా సంఘం కమిటీ సభ్యులు ప్రసాద్, రమణ, సత్తిబాబుల ఆహ్వానం మేరకు ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త గౌ!! శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారి *కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ* గురువారం శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లి అమ్మవారును దర్శించి పట్టు వస్త్రములను సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా కమిటీ సభ్యులు, ఆలయ పూజారి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గుడి పూజారి ఆశీర్వాదం పొందారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముఖ్య నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోట వాసు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.