ఎండాడలో లైన్స్ క్లబ్,, స్కై పార్క్ లో విస్తృత కార్యవర్గసమావేశం, తమ సేవలు విస్తరించేందుకు ప్రణాళిక.. లయన్ హరి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశం..
February 28, 2026
లైన్స్ క్లబ్ సేవలు విస్తృత పరిచేందుకు ప్రణాళిక సిద్ధం.. లయన్స్. హరిప్రసాద్
విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ :( సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) (ఎండాడ న్యూస్ )
లయన్స్ క్లబ్, స్కై పార్క్, ఎండాడ , లో శుక్రవారం రాత్రి లయన్ హరి ప్రసాద్ అధ్యక్షతన, ఫిబ్రవరి 1న లయన్స్ క్లబ్ ప్రారంభోత్సవం తర్వాత మొట్టమొదటి ప సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మార్చి నెలలో నిర్వహించు కార్యక్రమములు గురించి చర్చించుట జరిగింది. ప్రధాన కార్యదర్శి రాజు, కోశాధికారి శాస్త్రి, మాట్లాడుతూ ఇంతటి పెద్ద గ్రేటెడ్ కమ్యూనిటీలో సబ్స్క్రిప్షన్ చెల్లించి సేవలకు లయన్స్ సబ్యులు ముందుకు రావడం చాలా అభినందనీయమని తెలియజేస్తూ సభ్యుల సలహాలు సూచనల మేర ప్రతినెల సమావేశం నిర్వహించి కార్యక్రమాల కోసం నిర్ణయాలు తీసుకుంటామని తెలియజేశారు.లయన్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూఅంతర్జాతీయ లయన్స్ క్లబ్ క్యాలండర్ కార్యక్రమములతో పాటు మిగతా సేవా కార్యక్రమాలు లో కూడా పాల్గొనాలని తెలియజేశారు..లయన్స్ సబ్యులు కన్నన్,చక్రపాణి,వెంకట రామకృష్ణారావు లు వేసవి లో చేయవలసిన సేవలు గురించి,మెడికల్ అండ్ బ్లడ్ క్యాంప్ లు గురించి తమ తమ అభిప్రాయాలను తెలిపినారు.ఈ సమావేశంలో లయన్స్ సభ్యులు, డైరెక్టర్లు పాల్గొన్నారు..


