భీమిలి నియోజకవర్గం మూల కుద్దు మండల వైసీపీ గ్రామస్థాయి కమిటీ నియామకాలు... పర్యవేక్షించిన భీమిలి నియోజకవర్గం మహిళా యువ నేత భీమిలి వైసీపీ సమన్వయకర్త చిన్న శీను కుమార్తె సిరమ్మ. మూల కుద్దు గ్రామ సర్పంచ్ కె రామకృష్ణ ఆధ్వర్యంలో కమిటీ నియామకాలు.
February 26, 2026
భీమిలి లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీల నియామకాన్ని పరిశీలించిన చిన్న శ్రీను సోల్జర్ అధ్యక్షురాలు సిరమ్మ.
భీమిలి నియోజకవర్గం, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
భీమిలి , ఫిబ్రవరి 26 :వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం భీమిలి నియోజకవర్గం, భీమిలి మండలం, ములకుద్దు గ్రామ సర్పంచ్ కె.రామకృష్ణ ఆధ్వర్యంలో మండల వైఎస్సార్సీపీ పార్టీ గ్రామస్థాయి కమిటీల నియామకం ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి భీమిలి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీగా ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) *కుమార్తె, 'చిన్న శ్రీను సోల్జర్స్' అధ్యక్షురాలు సిరమ్మ* హాజరై వైయస్సార్సీపి కమిటీల నియామకాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా *సిరమ్మ* మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి గ్రామ కమిటీలు కీలకమని, ప్రతి కార్యకర్త తమ వివరాలను గ్రామ కమిటీలకు తెలియ చేయడం ద్వారా పార్టీ యంత్రాంగాన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు. జగనన్న ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భీమిలి మండల పార్టీ అధ్యక్షులు గాడు శ్రీను , గ్రామ ఇంచార్జ్ టీ నగర్ సర్పంచ్ శేఖర్, చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోటవాసు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు 'చిన్న శ్రీను సోల్జర్స్ భ్యులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.

