ఓమ్ని ఆర్కె హాస్పిటల్స్ నిర్వహణలో ఉచిత ,వైద్య శిబిరం.. 120 మందికి సాధారణ వైద్య పరీక్షలు. వాసన్ కంటి ఆసుపత్రి వారిచే 88 మందికి కంటి వైద్య పరీక్షలు. అవసరమైన వారికి కళ్ళజోళ్ళు పంపిణీ కి లబ్ధిదారుల గుర్తింపు.. ఎండాడ లోగల స్కై పార్క్ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అక్కడ పనిచేస్తున్న, గృహ సేవకులకుసెక్యూరిటీ గార్డులకు వైద్య సేవలు, విశాఖ జిల్లా లైన్స్ క్లబ్ 316 ఏ గవర్నర్ సూర్య ప్రకాష్ అధికారిక పర్యటనలో భాగంగా ఉచిత వైద్య శిబిరం. ఈ సందర్భంగా గవర్నర్ కు ఘన సన్మానం ఐను హాస్పిటల్ సహకారంతో కిడ్నీ సంబంధిత వ్యాధులు పరీక్ష లునిర్వహించారు.. తమకు వైద్య పరీక్షలు, చేసిన,చేయించిన,అందరికీ కృతజ్ఞతలు తెలియజేసిన స్కై పార్క్ సేవకులు.....
March 22, 2026
విశాఖ సిటీ,ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: (సీనియర్ జర్నలిస్టు మానం శ్రీను)
లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ , ఎండాడలో గల వైశాకి స్కై పార్క్ లయన్స్ క్లబ్, ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం ఓమ్ని ఆర్కే హాస్పిటల్స్ వారి నిర్వహణలో విశాఖపట్నం జిల్లా లైన్స్ క్లబ్స్ 316 ఏ లయన్స్ గవర్నర్ డి . సూర్య ప్రకాష్ అధికార పర్యటనలో భాగంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. స్కై పార్క్ నందు గృహ సేవకులకు మరియు సెక్యూరిటీ గార్డులకోసం నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరంలో సుమారు 120 మంది సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకోగా, 88 మంది కంటి పరీక్షలు వాసన్ కంటి ఆసుపత్రి వారి సహాయంతో చేశారు. కళ్ళజోడులు పంపిణీ కోసం అవసరమైన లబ్ధిదారులను గుర్తించడం జరిగింది. అదేవిధంగా కిడ్నీకి సంబంధించిన పరీక్షలు ఐను హాస్పిటల్స్ వారి సహాయంతో నిర్వహించినారు. ఓమ్ని ఆర్కే హాస్పిటల్ సిబ్బంది , టెక్నీషియన్స్ ఎనిమిది మంది వైద్య పరీక్షలు నిర్వహించారు. తనిఖీ చేసిన పరీక్షలు ఆధారంగా ఇద్దరు వైద్యులు సూచించిన మేరకు ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న గవర్నర్ ఈ సమావేశంలో క్లబ్బు అభివృద్ధి కోసం ప్రధాన కార్యదర్శి లయన్ సీతారామరాజు , కోశాధికారి లయన్ విశ్వనాథ శాస్త్రి లకు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. అనంతరం గవర్నర్ గారికి శాలువాతో సత్కరించడం జరిగినది.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్స్ జిల్లా ప్రధమ మహిళ శ్రీమతి సూర్య ప్రకాష్, వైస్ గవర్నర్ ఎన్. శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర రావు, ప్రోగ్రాం కోఆర్డినేటర్స్ లయన్స్ ఫణి శేఖర్, వెంకట రామకృష్ణారావు, సీనియర్ లయన్స్ సభ్యులు శ్రీ కన్నన్ మరియు హేమా కన్నన్,ప్రసన్న కుమారి, శ్రీనివాసరావు, వేణు,ఈశ్వర్ రెడ్డి, సుబ్బ చంద్ర, సురేష్ లు పాల్గొన్నారు.
-
Newer

Older