వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వి 2o1 ఏ రీజియన్ 2, జోన్ 2, వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో* పరాభవ నామ* ఉగాది వేడుకలు* ఎంవిపి కాలనీ సెక్టార్ వన్ లో గల శిరిడి సాయి ఆలయంలో శ్రీ ప్రభాకర్ శాస్త్రిచే పంచాంగ శ్రవణం..
March 20, 2026
విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
జై వాసవి... జై జై వాసవి 🙏
వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ,వి 201 ఏ , రీజియన్ 2 ,జోన్ 2 వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో తేది 19-03-2026 న గురువారం నాడు సాయంత్రం గం.5.00లకు *శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది* పర్వదిన సందర్భంగా ఎం.వి. పి.కాలనీ, సెక్టార్ -1 లో అమ్మా హాస్పిటల్ ఎదురుగా ఉన్న శ్రీ షిరిడీ సాయి బాబా గుడిలో ,
శ్రీ ప్రభాకర శాస్త్రి గారిచే *పంచాంగ శ్రవణం* నిర్వహించబడినది. తదనంతరం ప్రభాకర శాస్త్రి గారికి సాలువతో సత్కరించారు.ఈ యొక్క పంచాంగ శ్రవణం కార్యక్రమం లో క్లబ్ ప్రధాన కార్యదర్శి వాసవియన్స్ చంద్రశేఖర్ గుప్తా , చార్టర్ ప్రెసిడెంట్ చెరుకు కృష్ణ, పూర్వపు అధ్యక్షులు జోన్ చైర్ పర్సన్ వెంకట రామకృష్ణారావు, గ్రంధి కృష్ణారావు, పూసర్ల సూర్యరావు, గోగుల నర్సింగరావు, బుడ్డెపు రామారావు,ప్రోగ్రాం చైర్ పర్సన్ శివరామకృష్ణ, గ్రంధి వాసుదేవ మూర్తి
మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
