వాసవి క్లబ్ ఎంవిపి కపుల్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్విల్. విజిట్. అంతర్జాతీయ సేవా విభాగపు కార్యదర్శి వాసవి ఎన్ ప్రతిభా సంకల్ప స్టార్ కే సి జి ఎఫ్ జు లూరి మహేష్ బాబు దాత సహాయంతో సరస్వతీ దేవి విగ్రహం ఆవిష్కరించిన వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షులు వాసవి ఎన్ సేవా సంకల్ప స్టార్ కే సి జి ఎఫ్ .. సిద్ధ సూర్యప్రకాశరావు..... పేద చిల్లర వర్తకునికి 20వేల రూపాయలు వడ్డీ లేని రుణం.

విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : (సీనియర్ జర్నలిస్ట్ మాన0 శ్రీను మధురవాడ ) వాసవీ క్లబ్ ఎం వి పి కపుల్స్ ఆధ్వర్యంలో తేదీ 14.03.2026 శనివారం ఉదయం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్విల్ విజిట్ సందర్భంగా విశాఖపట్నం ఒకటవ పట్టణం పరిధిలో గోదేవారి వార్డ్ లో గల జీ వీ ఎం సీ ప్రైమరీ స్కూల్ ఆవరణలో అంతర్జాతీయ సేవా విభాగపు కార్యదర్శి వాసవియన్ ప్రతిభా సంకల్ప స్టార్ కేసీజిఎఫ్ జులూరి మహేష్ బాబు దాత గా ఇచ్చిన *సరస్వతి దేవి విగ్రహాన్ని* ముఖ్య అతిథిగా పాల్గొన్న వాసవి క్లబ్స్ అంతర్జాతీయ అధ్యక్షులు వాసవియన్ సౌభాగ్య సేవా సంకల్ప స్టార్ కేసీజిఎఫ్ సిద్ధ సూర్యప్రకాశరావు గారు ఆవిష్కరణ చేసినారు. తదనంతరం సూర్యారావు,నరసరత్నం అని ఇద్దరు చిరు వ్యాపారులకు రూ.20,000/- రూపాయలు వడ్డీ లేని రుణం ఆర్థిక సహాయం అంద చేసినారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్లబ్ స్వయం ఉపాధి పథకం కింద చిరు వ్యాపారాలకు ప్రతినెల ఒకరికి రూ.20,000/- వడ్డీ లేని రుణం ఇప్పటివరకు 100 మంది చిరు వ్యాపారులకు ఇవ్వడం అభినందనీయమని, అద్భుతమైన సేవగా వర్ణిస్తూ సభ్యులు మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి వాసవి సేవలు వినియోగించుకొని జిల్లాలో ముందు స్థాయిలో ఉండాలని కొనియాడారు . అందుకు తగిన ప్రోత్సాహకాన్ని తాను అందిస్తానని హామీ ఇచ్చారు. ఎంవిపి వాసవి క్లబ్ కపుల్స్ చేసిన సేవా కార్యక్రమాలు అంతర్జాతీయ అధ్యక్షులు వారికి స్పష్టంగా వివరించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ వాసవియన్ విద్యాసంకల్ప స్టార్ కేసీజిఎఫ్ వంకాయల సాయినిర్మల, క్యాబినెట్ కార్యదర్శి బి వి పద్మావతి,క్యాబినెట్ కోశాధికారి చెరుకు కృష్ణ, క్యాబినెట్ సేవా విభాగపు కార్యదర్శి రమణి , గ్రంధి వాసుదేవ మూర్తి,వాసవి క్లబ్ ప్రాంతీయ అధికారిని తమ్మన మానస, వాసవి క్లబ్ జోన్ చైర్ పర్సన్ వాసవియన్, వెంకట రామకృష్ణారావు,క్లబ్ కార్యదర్శి వాసవియన్ చంద్రశేఖర్ గుప్తా, కోశాధికారి చెరుకూరి నరసింగరావు, ప్రోగ్రాం చైర్ పర్సన్ వాసవియన్ శివరామకృష్ణ పూర్వపు అధ్యక్షులు మల్లేశ్వర గుప్తా, గోగుల నర్సింగరావు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.