వినూత్న పద్ధతిలో అంతర్జాతీయ వాసవి క్లబ్ వారిచే సామూహిక వ్యాపారం. ప్రారంభించిన అంతర్జాతీయ వాసవి క్లబ్ అధ్యక్షులు సిద్ధ సూర్య ప్రకాశరావు ఆర్యవైశ్యుల కుల వృత్తిపై వ్యాపారంలో కొత్త మెలుకులు వ్యాపార అభివృద్ధి పై మంచి అవగాహన పెంపొందించిన సూర్య ప్రకాష్. దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలు ఆర్యవైశ్యులు .-- జిల్లా గవర్నర్ వంకాయల సాయి నిర్మల

అంతర్జాతీయ వాసవి క్లబ్ వారిచే వినూత్న పద్ధతిలో సామూహిక వ్యాపారం విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఛానల్: అంతర్జాతీయ వాసవి క్లబ్ అధ్యక్షులు సిద్ధా సూర్య ప్రకాశ రావు ఈ సంవత్సరం ఆర్య వైశ్యుల కుల వృత్తి ఆయన వ్యాపారం లో కొత్త మెళుకులతో వ్యాపార అభివృద్ధి నిమిత్తం *"వి బస్"* (*వాసవి బిజినెస్*) అనే కార్యక్రమాన్ని బీచ్ రోడ్ లో గల కాళిక మాత ఆలయం దగ్గిర తేదీ 14.03.3026 శనివారం ఉదయం 6.30 గంటలకు సుమారు 400 మంది సభ్యులు పాల్గొన్న సభలో ప్రారంభించారు. దీనికి రూప కర్త అంతర్జాతీయ మాజీ అధ్యక్షులు ఏ.వి.ఎస్.ఎన్.గుప్తా గారు. మరియు వారికి సలహా దారులుగా వేదా మధుసూదన్, నల్లూరి నూకరాజు గారు మరియు ,ఈ కార్యక్రమానికి ప్రోగ్రామ్ ఛైర్పర్సన్ గా అమర్నాథ్ తమ్మన వ్యవహరిస్తున్నారు. జిల్లా గవర్నర్ సాయి నిర్మల వంకాయల గారు సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఆర్య వైశ్యులు దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్థంబాలు అని, సమిష్టిగా గ్రూప్ ద్వారా వ్యాపారాన్ని చేస్తే వారికి ఎన్నో అవకాశాలు వాసవి క్లబ్స్ వారు కల్పిస్తున్నారని , వారికి ఆర్థిక సహాయం తో పాటు సలహాలు కూడా అందజేస్తున్నారని తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార్లు అయిన పద్మావతి ,చెరుకు కృష్ణ,రమణి ఈ కార్యక్రమానికి చిరు వ్యాపారాలకు సలహా దారులుగా మాజేటి విశ్వ కళ్యాణ్, కంకటాల సతీష్, మరియు అధిక సంఖ్యలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.