వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వి201 ఏ, రీజియన్ టు చైర్పర్సన్ అవగాహన సందర్శన. ముఖ్యఅతిథిగా తమ్మన మానస, వాసవి క్లబ్ మేఘాద్రి గడ్డ డైమండ్స్ చేస్తున్న సేవలకు కితాబు. ఐక్యమత్యంతో పని చేస్తే దేనినైనా సాధించవచ్చు జోన్ 2 చైర్పర్సన్ ఏ.వి.ఆర్
March 31, 2026
విశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్..
వి 201 ఏ ,రీజియన్ 2 చైర్ పర్సన్ అవగాహన సందర్శన -----------------------------------వాసవి క్లబ్ రెండవ ప్రాంతీయ అధికారిని తమ్మన మానస తన పర్యటనలో భాగంగా ముఖ్యఅతిథిగా విచ్చేసి వాసవి క్లబ్ మేఘాద్రి గడ్డ డైమండ్స్ చేస్తున్న సేవా కార్యక్రమాల పట్ల సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఇంకా అవసరమైన వారికి సేవలు విస్తృత పరచాలని కోరారు. అంతర్జాతీయ వాసవి క్లబ్స్ చేపడుతున్న
వివిధ రకాల స్కీమ్స్ గురించి తెలియచేశారు. సేవా కార్యక్రమాలలో భాగంగా ఒక వాసవి కుటుంబానికి 15 రోజులకు సరిపడా బియ్యము వంట సామాగ్రి అందచేసారు. జోన్ చైర్ పర్సన్ గా విచ్చేసిన వెంకట రామకృష్ణారావు మాట్లాడుతూ ఈ క్లబ్ సభ్యులు అందరూ కలిసి మెలసి సామూహికంగా నిర్ణయాలు తీసుకొని కార్యక్రమాలు చేస్తారని,
వీ సీ ఐ వారు సూచించిన క్యాలెండర్ యాక్టివిటీస్ తో పాటు ఇతర కార్యక్రమాలు కూడా నిర్వహించాలని తెలియజేసినారు..ప్రోగ్రాం అబ్జర్వర్ గా విచ్చేసిన చెక్క చందన గారు మాట్లాడుతూ క్లబ్బు అభివృద్ధికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. తదనంతరం ముఖ్య అతిథికి సాలువతో సత్కరించి ఘన సన్మానం చేసినారు.మరియు జోన్ చైర్ పర్సన్ , ప్రోగ్రాం అబ్జర్వర్ లకు సాలువులతో సత్కరించినారు.ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు పసుమర్తి రాజు,కార్యదర్శి సతీష్, కోశాధికారి రామసాగర్, క్లబ్బు ఉపాధ్యక్షులు శంకర్ మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు


