వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వి 2o1 ఏ, రీజియన్ టు చైర్ పర్సన్ అవగాహన సందర్శన.. వాసవి క్లబ్ రెండవ ప్రాంతీయ అధికారిని తమ్మన మానస... వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ చేపడుతున్న సేవలు బేస్. మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతూ విస్తృత పరచాలి. ప్రతినెలా ఒక వాసవి కుటుంబానికి 20వేల రూపాయలు వడ్డీ లేని రుణం. ఎనిమిది సంవత్సరాలుగా కొనసాగుతున్న వడ్డీ లేని రుణాలు.

విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) వాసవి క్లబ్ ఇంటర్నేషనల్.. వి 201 ఏ ,రీజియన్ 2 చైర్ పర్సన్ అవగాహన సందర్శన -----------------------------------వాసవి క్లబ్ రెండవ ప్రాంతీయ అధికారిని తమ్మన మానస తన పర్యటనలో భాగంగా ముఖ్యఅతిథిగా విచ్చేసి వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ చేస్తున్న సేవా కార్యక్రమాల పట్ల సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఇంకా అవసరమైన వారికి సేవలు విస్తృత పరచాలని, ఈ క్లబ్బులో సీనియర్ లీడర్స్ ఉండడంచేత క్లబ్బు పి ఎస్ టి లు చాలా సులభతరంగా కార్యక్రమాలు చేసుకోవడానికి వీలవుతుందని ఇది వారి అదృష్టంగా భావిస్తున్నానని అభివర్ణించారు. అంతర్జాతీయ వాసవి క్లబ్స్ చేపడుతున్న వివిధ రకాల స్కీమ్స్ గురించి తెలియచేశారు. సేవా కార్యక్రమాలలో భాగంగా ఒక వాసవి కుటుంబానికి రూపాయలు 20,000/- వడ్డీ లేని రుణ సహాయం అందచేసారు. ప్రోగ్రాం అబ్జర్వర్ గా విచ్చేసిన ఎం . శ్రీనివాస రావు మాట్లాడుతూ ఈ క్లబ్బు ఎల్లప్పుడూ అన్ని కార్యక్రమంలో ముందుంటుందని, సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ స్కీము లో భాగంగా వడ్డీ లేని రుణము ప్రతినెల 20 వేల రూపాయలు ఒకరికి సహాయం చేయడం చాలా అభినందనీయమని, ఈ స్కీమ్ సుమారు 8 సంవత్సరాలుగా చేయడం చాలా ఆనందదాయకమని, ఇప్పటివరకు వందమంది ఈ స్కీం కింద లబ్ధి పొందారని తెలిపినారు. తదనంతరం ముఖ్యఅతిథికి సాలువతో సత్కరించి ఘన సన్మానం చేశారు. జోన్ చైర్ పర్సన్ వెంకట రామకృష్ణారావు, ప్రోగ్రాం అబ్జర్వర్ శ్రీనివాసరావు, ప్రాంతీయ కార్యదర్శి గోగుల కమల్ కుమార్ లకు సత్కరించినారు.ఈ కార్యక్రమంలో పూర్వపు జిల్లా గవర్నర్ తమ్మన అమర్నాథ్, క్యాబినెట్ కోశాధికారి చెరుకు కృష్ణ, క్లబ్ అధ్యక్షుడు వెంకటరమణమూర్తి,కార్యదర్శి చంద్రశేఖర్ గుప్తా, కోశాధికారి, నర్సింగరావు, ప్రోగ్రాం చైర్ పర్సన్ శివరామకృష్ణ, వేద మధుసూదన్, గ్రంధి వాసుదేవ మూర్తి, పూర్వపు అధ్యక్షులు, పూర్వపు గవర్నర్లు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.