జై వాసవి అల్లిపురం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా గవర్నర్ అధికారిక పర్యటన కు వి 201 ఏ గవర్నర్ వాసవియన్ విద్యాసంకల్ప శ్రేయోభిలాషి వంకాయల సాయినార్మల ముఖ్య అతిథి. గా విచ్చేసి అక్కయ్యపాలెంలో గల ప్రియదర్శిని వృద్ధాశ్రమమునకు 60 వేల రూపాయలు విలువ చేసే నిత్యవసర సరుకుల పంపిణీ చేసిన గవర్నర్.
March 30, 2026
జై వాసవి 🙏
విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
తేదీ 29.03.2026 ఆదివారం వాసవి క్లబ్ అల్లిపురం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా గవర్నర్ అధికారిక పర్యటన కు వి 201ఏ గవర్నర్ వాసవియన్ విద్యా సంకల్ప శ్రేయోభిలాషి వంకాయల సాయి నిర్మల ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
మొదటి గా సేవా కార్యక్రమంలో భాగంగా అక్కయ్యపాలెం లో గల ప్రియదర్శిని వృద్ధాశ్రమం నకు రూ.60,000/- విలువగల నిత్యావసర సరుకులను గవర్నర్ చేతుల మీదుగా అందించినారు.. అనంతరం అల్లిపురం వాసవి సమాజంలో నిర్వహించిన క్లబ్ సభ్యుల సమావేశంలో ప్రసంగిస్తూ ఈ సంవత్సరం జిల్లాలో మొట్టమొదటి గా గవర్నర్ పర్యటన ను వాసవి క్లబ్ అల్లిపురం నుండి ప్రారంభిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. వి సీ ఐ వారు నిర్దేశించిన కార్యక్రమంలను సభ్యులకు వివరించినారు. జోన్ చైర్ పర్సన్ స్నేహపూర్వక పర్యటన, ప్రాంతీయ చైర్ పర్సన్ అవగాహన సదస్సు, గవర్నర్ అధికారిక పర్యటన మరియు అంతర్జాతీయ అధ్యక్షులు గుడ్విల్ పర్యటన ను అల్లిపురం క్లబ్ ఈ మూడు నెలల్లోనే పూర్తి చేసుకున్నందుకు అభినందనలు తెలిపారు.
వి సీ ఐ వారు నూతనంగా క్లబ్బులలో చేరిన వనితలకు ఇచ్చిన చీరలను క్లబ్ నూతన వనిత సభ్యులకు అందజేసినారు..
ఈ కార్యక్రమంలో జిల్లా క్యాబినెట్ కోశాధికారి వాసవియన్ చెరుకు కృష్ణ , క్యాబినెట్ సెక్రటరీ( సేవా విభాగం)గరుడ రమణి , వైస్ గవర్నర్ మాజేటి విశ్వ కళ్యాణ్ (పండు) , ప్రాంతీయ చైర్పర్సన్ డి.వి.ఎస్.ఎన్.రాజు , జోన్ చైర్పర్సన్ కందుల కళ్యాణి , ప్రాంతీయ సెక్రటరీ దాసు అనిల్ , క్లబ్ అధ్యక్షులు బివిఎల్ కుమార్, కోశాధికారి వి.శివరామకృష్ణ ప్రసాద్, క్లబ్బు పూర్వ అధ్యక్షులు ఎస్.విఠల్ కుమార్, పి.రత్నాజీరావు, బోర్డు సభ్యులు మరియు సభ్యులు పాల్గొన్నారు.


