వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వి 2o1 ఏ, రీజియన్ టు, జోన్ 2 వాసవి క్లబ్ మేఘాద్రి గెడ్డ డైమండ్స్ ఆధ్వర్యంలో కే సి జి ఎఫ్ వెంకట రామకృష్ణారావు స్నేహపూర్వక పర్యటన,శ్రీ శ్రీ శ్రీ కొత్తమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో సమావేశం. మేఘాద్రి గెడ్డ డైమండ్స్ క్లబ్ సేవ లు అమోఘం ,. ఈ సందర్భంగా వెంకటరామకృష్ణారావుకు ఘన సన్మానం.
March 30, 2026
జై వాసవి... జై జై వాసవి 🙏
విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్,: (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్,
వి 201 ఏ, రీజియన్ 2,
జోన్ 2.. వాసవి క్లబ్ మెగాద్రిగడ్డ డైమండ్స్ ఆధ్వర్యంలో
తేదీ 29.03.2026 ఆదివారం సాయంత్రం జోన్ చైర్ పర్సన్ వాసవియన్ 2* కపుల్ కే సి జి ఎఫ్ వెంకట రామకృష్ణారావు స్నేహపూర్వక పర్యటన మేఘాద్రి గడ్డ శ్రీశ్రీశ్రీ కొత్తమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధి గా పాల్గొన్న వాసవియన్ 2* కపుల్ కె సి జి ఎఫ్ వెంకట రామకృష్ణారావు మాట్లాడుతూ మేఘాద్రి గడ్డ డైమండ్స్ క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు గురించి కొనియాడారు. క్లబ్బు మెంబర్షిప్ ఇంకనూ పెంచాలని కార్యక్రమాలు సభ్యులందరూ కలిసి నిర్వహించాలని, క్యాలెండర్ యాక్టివిటీస్ తో పాటు వి సి ఐ వారు సూచించిన కార్యక్రమాలు కూడా నిర్వహించాలని, వి కె ఎస్ పి,కే సి జి ఎఫ్ ల పై దృష్టి పెట్టాలని, జిల్లా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమమాలలో అందరూ సభ్యులు పాల్గొనాలని చెబుతూ, సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముఖ్య అతిథి చేతుల మీదుగా వెంకటేష్ అను ఒక వ్యక్తికి 15 రోజులకు సరిపడగా బియ్యం మరియు పప్పు దినుసులు అందించడం అయినది. తదనంతరం క్లబ్ సభ్యులు ముఖ్యఅతిథికి శాలువ తో సత్కరించి బహుమతిని అందజేసినారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు వాసవియన్ పసుమర్తి రాజు, ప్రధాన కార్యదర్శి సతీష్ , కోశాధికారి వాసవియన్ రామసాగర్ , ఉపాధ్యక్షులు వాసవియన్ శంకర్ మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

