అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన ఎంవిపి వాసవి క్లబ్ కపుల్స్ ఎక్స్ అధ్యక్షులు రీజియన్ టు జోన్ చైర్పర్సన్ , ఏవి రామకృష్ణారావు. క్లబ్ సభ్యులు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ చేస్తున్న సేవలను కొనియాడారు.

విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్:( సీనియర్ జర్నలిస్ట్ మనం శ్రీను మధురవాడ) జై వాసవి.. జై జై వాసవి... తేదీ 16.03.2026 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు తన ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించిన అమరజీవి ప్రముఖ గాందేయవాది ,స్వాతంత్ర సమరయోధులు పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా, ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ పూర్వపు అధ్యక్షుడు Vn.ఏవి రామకృష్ణారావు ప్రస్తుతం రీజియన్ టు 2, జోన్ చైర్ పర్సన్ మరియు క్లబ్ సభ్యులు కలసి ఎంవిపి సెక్టార్ 3, షిరిడి సాయి పార్క్ నందు గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి పుష్పమాల సమర్పించి సభ్యులు అందరూ ఘన నివాళులు అర్పించిరి. తదుపరి పొట్టి శ్రీరాములు గారు ప్రత్యేక తెలుగు రాష్ట్రానికి చేసిన ప్రాణ త్యాగం గురించి వివరిస్తూ, మన వాసవి క్లబ్స్ చేస్తున్న సామాజిక, సాంఘిక సేవా కార్యక్రమాల గురించి తెలియజేసినారు.ఈ కార్యక్రమంలో వాసవియన్స్ చంద్రశేఖర్ గుప్తా(ప్రధాన కార్యదర్శి) , చెరుకూరి నర్సింగరావు (కోశాధికారి), చార్టర్ ప్రెసిడెంట్ చెరుకు కృష్ణ గారు, ఫాస్ట్ ప్రెసిడెంట్ మల్లేశ్వర గుప్త, ప్రోగ్రాం చైర్మన్ పి. శివరామకృష్ణ, మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.