వాసవి క్లబ్ జోన్ 2 మెగాద్రి గెడ్డ డైమండ్స్ 2026 నూతన అధ్యక్షుడిగా వాసవి ఎన్ పసుమర్తి రాజు నియామకం. రాజుచే ప్రమాణ స్వీకారం చేయించిన విశాఖ జిల్లా గవర్నర్ వాసవియన్ విద్యాసంకల్ప కే సి జి ఎఫ్. శ్రేయోభిలాషి వంకాయల సాయి నిర్మల .. సేవలందించిన పలువురికి ఘన సన్మానం..
March 29, 2026
జై వాసవి... జై జై
విశాఖ సిటీ, (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్టు మానం శ్రీను మధురవాడ )
వాసవి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్...
తేదీ 29.03.2026 ఆదివారం సాయంత్రం
వి 201 ఏ విశాఖపట్నం జిల్లా, రీజియన్ టు, జోన్ 2లో గల వాసవి క్లబ్ మెగాద్రిగడ్డ డైమండ్స్ 2026 నూతన అధ్యక్షునిగా వాసవియన్ పసుమర్తి రాజు చే జిల్లా గవర్నర్ వాసవియన్ విద్యాసంకల్ప కేసీజిఎఫ్* శ్రేయోభిలాషి సాయి నిర్మల ప్రమాణం చేయించారు. తదుపరి నూతన అధ్యక్షుని అంగీకారంతీసుకొని ప్రధాన కార్యదర్శి గా వాసవియన్ సతీష్, కోశాధికారిగా వాసవియన్ రామసాగర్ , ఉపాధ్యక్షులు వాసవియన్ శంకర్ లచే ప్రమాణం చేయించారు. తదనంతరం ముఖ్య అతిధి, ఇన్స్టలేషన్ అధికారిని గవర్నర్ సాయి నిర్మల అంతర్జాతీయ వాసవి క్లబ్ కార్యక్రమాలు గురించి వివరించారు. తదనంతరం గవర్నర్ కి,ఇతర అతిథి లకు క్లబ్ సభ్యులు సన్మానం చేశారు. గవర్నర్ సాయినిర్మల 2025 అద్యక్షుని గా మంచి సేవలు అందించిన వాసవియన్ పసుమర్తి రాజు కు అభినందించినారు. 2026 సంవత్సరము లో కూడా మంచి కార్యక్రమాలు చేసి క్లబ్ ను మరింతముందుకు తీసుకొని వెళ్ళాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో క్యాబినెట్ కోశాధికారి వాసవియన్ చెరుకు కృష్ణ , క్యాబినెట్ సేవావిభాగపు కార్యదర్శి రమణి, వైస్ గవర్నర్ వాసవియన్ చక్కా చందన,ప్రాంతీయ అధికారిని తమ్మన మానస, జోన్ చైర్ పర్సన్ వాసవియన్ వెంకట రామకృష్ణారావు మరియు అధిక సంఖ్యలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.


