ఘనంగా వాసవి మాత తృతీయ శోభాయాత్ర,,అంతర్జాతీయ కార్యదర్శి (అడ్మినిస్ట్రేషన్) వాసవి ఎన్ విద్యా సంకల్ప స్టార్ కే సి జి ఎఫ్ దర్శి శ్రీనివాసరావు గుప్తా 54వ జన్మదినోత్సవం సందర్భంగా వాసవి మాత పల్లకి ఊరేగింపు ముందుగా తూర్పు దిశలో కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవం, వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్, ఎంవిపి వాసవి క్లబ్ సంయుక్తంగా శోభా యాత్ర నిర్వహణ .. వాసవి మాత వేషధారణలో బాలబాలికలు . మహిళలకు చీరలు పంపిణీ.

విశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ :( సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) జై వాసవి.జై జై వాసవి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వి 201 ఏ విశాఖపట్నం జిల్లా ఆధ్వర్యంలో తేదీ 02.03.2026 సోమవారం సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు పూర్ణిమి సందర్భంగా తృతీయ వాసవి మాత శోభా యాత్రను వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ మరియు వాసవి క్లబ్ ఎంవిపి కాలనీ వారు సంయుక్తంగా నిర్వహించిన ఈ శోభా యాత్ర ఎంవీపీ సెక్టార్ 3 నందు గల శిరిడి సాయిబాబా ఆలయంలో జిల్లా గవర్నర్ వాసవియన్ విద్యాసంకల్ప స్టార్ కే సి జి యఫ్ శ్రేయోభిలాషి వంకాయల సాయినిర్మల మరియు ముఖ్య అతిథి వాసవియన్ గోల్డెన్ స్టార్ కే సి జి ఎఫ్ శ్రేయోభిలాషి కంకటాల ప్రభాకర్ లు చక్కని పూల అలంకరణ చేసిన పల్లకిలో వాసవిమాత విగ్రహం నకు పూజలు నిర్వహించి, అంతర్జాతీయ కార్యదర్శి (అడ్మినిస్ట్రేషన్ ) వాసవియన్ విద్యాసంకల్ప స్టార్ కేసీజిఎఫ్ దర్శి శ్రీనివాసరావు గుప్తా గారి 54 వ జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి, పల్లకిని తూర్పు దిశగా తీసుకునివెళ్ళి కొబ్బరి కాయ తో హారతి సమర్పించి, సెక్టర్ 6 మరియు సెక్టార్ 9 పుర వీధులలో, బాలికలకు వాసవి మాత వేషధారణలో ఊరేగించి సెక్టార్ 9 నివసిస్తున్న 54 మంది నిరుపేద మహిళలుకు ఈ వాసవి మాతా శోభాయాత్రలో పాల్గొన్న పూర్వపు అంతర్జాతీయ అధ్యక్షులు ఏ వి ఎస్ ఎన్ గుప్తా గారి చేతుల మీదుగా చీరలు పంపిణీ చేసిన తదుపరి యధావిధిగా తిరిగి షిరిడి సాయి మందిరం నకు పల్లకిని తీసుకు వచ్చినారు. తదుపరి గవర్నర్ గారికి చిరు సత్కారం చేసి హారతితో కార్యక్రమం ముగింపు చేసినారు.ఈ శోభా యాత్ర లో ప్రతివీధిలోన ప్రజలు వాసవి మాత కు హారతులు ఇచ్చి స్వాగతం పలికి, ప్రసాదం స్వీకరించి మాత ఆశీస్సులు పొందినారు. ఈ శోభా యాత్ర లో భక్తులుకు పులిహోర మరియు తీపి బూంది ప్రసాదం పంపిణీ చేసినారు.ఈ కార్యక్రమంలో జిల్లా కేబినెట్ కార్యదర్శి పద్మావతి, కోశాధికారి చెరుకు కృష్ణ , ఆధ్యాత్మిక కోఆర్డినేటర్ ముత్తా సతీష్, ప్రోగ్రాం ఇన్చార్జిలు వాసవియన్ శివరామకృష్ణ, వాసవియన్ ముద్దుల మణికంఠ, రీజియన్ టు చైర్ పర్సన్ తమ్మన మానస, జోన్ చైర్ పర్సన్ 2 వెంకట రామకృష్ణారావు, జోన్ 1 చైర్ పర్సన్ వాసవియన్ జగదీశ్వరీ,రీజియన్ సెక్రటరీ గోగుల కమల్ కుమార్, ఎంవిపి కపుల్స్ క్లబ్ అధ్యక్షులు వాసవియన్ వెంకటరమణమూర్తి, ప్రధాన కార్యదర్శి వాసవియన్ చంద్రశేఖర్ గుప్తా, కోశాధికారి వాసవియన్ నర్సింగరావు, ఎంవిపి కాలనీ క్లబ్ అధ్యక్షురాలు మాధవి, ప్రధాన కార్యదర్శి ఉమ మరియు వివిధ క్లబ్బుల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు, కోశాధికారులు జిల్లా అధికారులు, మరియు ఐ ఇ సీ అధికారులు, వైస్ గవర్నర్లు రీజియన్ చైర్ పర్సన్స్, జాన్ చైర్ పర్సన్స్, రీజియన్ సెక్రటరీస్ మున్నగు వారు పాల్గొన్నారు.