ఎండాడ స్కై పార్కులో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం, పలువురు మహిళా ప్రముఖులకు ఘన సన్మానం.
March 09, 2026
విశాఖ సిటీ,ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ :
స్కై పార్క్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తేదీ 08.03.2026 ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్కై పార్క్ నందు ఆధ్యాత్మికంగా, మెడికల్ రంగంలోని మరియు వివిధ సందర్భాలలో గేటెడ్ కమ్యూనిటీలో సేవలు అందిస్తున్న డాక్టర్ కె విజయ రిటైర్డు సి ఎం ఓ (ఎన్ టి పి సి)గారికి, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ బి స్వప్న గారికి, అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెంటల్లీ డీజేబీల్డ్ మరియు సీనియర్ సిటిజన్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీమతి కె కవిత గారికి లయన్స్ మహిళలు శ్రీమతి హేమకన్నన్, శ్రీమతి రాధిక, శ్రీమతి ప్రసన్న లు శాలువాలతో సత్కరించగా క్లబ్ సభ్యులు సేప్లింగ్ లు బహుకరించినారు. ప్రధాన కార్యదర్శి రాజుగారు, కోశాధికారి శాస్త్రి గారు మాట్లాడుతూ మహిళా సన్మాన గ్రహీతలు కమ్యూనిటీకి చేస్తున్న సేవలను వివరించి కొనియాడినారు. అంతర్జాతీయ స్థాయిలో చాలా మంది మహిళల పాత్ర ఉన్నదని, చాలా ప్రాముఖ్యత సంతరించుకొని ఉన్నదని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ , క్లబ్బు ఉపాధ్యక్షులు రమేష్, సభ్యులు వేణు, వెంకట రామకృష్ణారావు, శ్రీనివాసరావు, శంకరరావు లు పాల్గొన్నారు


