శ్రీ మహాలక్ష్మి దేవి ఆరాధనలు వాసవి క్లబ్ వనిత కే సి జి యఫ్ ఫెమి నా వారి ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మీదేవి చరణ యుగ్మ ఆరాధనోత్సవం విశాఖ సిటీ,జగదాంబ దరి రామాలయం గల అంబికా బాగ్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న విశాఖ జిల్లా గవర్నర్ వంకాయల సాయి నిర్మల.
March 11, 2026
విశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
తేదీ 10.03.2026 మంగళవారం శాస్త్రోక్తంగా శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధనలు వాసవి క్లబ్ వనిత కె సి జి ఎఫ్ ఫెమినా వారి ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి దేవి చరణ యుగ్మ ఆరాధనోత్సవ కార్యక్రమాన్ని జగదాంబ దరి రామాలయం నందుగల అంబికా బాగ్ ఫంక్షన్ హాల్ లో సుమారు 500 మంది మహిళలుతో నిర్వహించడం జరిగింది. సమాజంలో ప్రతికూలతలు, అశుభాలు తొలగిపోయి ఆర్థిక స్థిరత్వం, సానుకూల శక్తి ప్రసరించాలనే ఆశయంతో షోడశోప చారములతో, అష్టోత్తర సహస్రనామములతో శ్రీ లక్ష్మీ దేవి జయంతి సందర్భంగా శ్రీ లక్ష్మీదేవి పాదపూజ నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా గవర్నర్ వంకాయల సాయినిర్మల పాల్గొన్న ఈ కార్యక్రమానికి వాసవియన్ బి వి సావిత్రి ప్రోగ్రామ్ చైర్పర్సన్ గా వ్యవహరించారు. ప్రెసిడెంట్ కెవిఎన్ మనీ (పుష్ప), సెక్రటరీ బి కృష్ణవేణి, కోశాధికారి పి. ఝాన్సీ లక్ష్మి మరియు ఇతర క్లబ్ అధికారులు బివి పద్మావతి, కె.రాధ , కె శారద,
ఎస్ మంగమణి, వి .రాధిక మరియు ఇతర సభ్యులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించినారు.


