ఎండాడ సత్యసాయి మందిరంలో ఘనంగా స్వామివారి 15వ ఆరాధన దినోత్సవం , మినీ సత్య సాయి విగ్రహ ఆవిష్కరణ, ప్రత్యేక పూజలు చేసిన సిటీ సమితి కన్వీనర్ సాయికుమార్ ఎండాడ భజన మండలి కన్వీనర్ వెంకట రామకృష్ణ ,. మహిళలచే లలితా సహస్ర పారాయణం, నూతన వస్త్రాలు పేదలకు పంపిణీ, పేదలకు అమృత కళాశాల పంపిణీ,
April 24, 2026
విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
ఓం శ్రీ సాయిరాం...
తేదీ 24.04.2026 శుక్రవారం శ్రీ సత్య సాయి భజన మండలి, ఎండాడ వారి ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి 15వ ఆరాధన దినోత్సవం ఘనంగా జరిగింది. ఉదయం 4 గంటల 45 నిమిషాలకు ఓంకార, సుప్రభాత ,నగర సంకీర్తనలు అనంతరం 10 గంటల 30 నిమిషాలకు నూతనంగా ఏర్పాటు చేసిన మినీ సత్యసాయి విగ్రహానికి సిటీ సమితి కన్వీనర్ సాయికుమార్ , భజన మండలీ కన్వీనర్ వెంకట రామకృష్ణారావు పూజలు నిర్వహించినారు. తదనంతరం మహిళలచే లలితా సహస్ర పారాయణ, లింగాష్టకం, స్వామివారి అష్టోత్తర శతనామార్చన మరియు నామ సంకీర్తన నిర్వహించినారు. సేవా కార్యక్రమంలో భాగంగా ముగ్గురు నిరుపేద కుటుంబాలకు అమృత కలశాలు ,పది మంది నిరుపేదలకు చీరలు, ముగ్గురు నిరుపేద వ్యక్తులకు దుప్పట్లు ,ఇరువురు కు పాదరక్షలు మందిరం సభ్యుల ద్వారా పంపిణీ చేయడం జరిగింది.మూగ జీవులకు దాహార్తిని తీర్చుటకు మంచి నీటిని మట్టి బౌల్స్ లో నీరు వేసి మందిరం ప్రాంగణంలో ఉంచడం జరిగింది. కన్వీనర్ వెంకట్ రామకృష్ణారావు మాట్లాడుతూ వేసవి సందర్భంగా పాదాచార్ల దాహార్తిని తీర్చుటకు త్వరలో హైవే బస్ స్టాప్ దగ్గర చలివేంద్రం (మజ్జిగ సేవ) మందిరం సభ్యుల యొక్క సహాయ సహకారాలతో ప్రారంభించనున్నట్లు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో మందిరం ఇంచార్జ్ కృష్ణారావు, గ్రూప్ లీడర్లు అప్పలనాయుడు మాస్టారు,నాగవేణి, ఆధ్యాత్మిక ఇంచార్జ్ లు రామచంద్ర రావు,పద్మజ, బాల వికాస్ ఇంచార్జ్ శ్యామల మరియు గోపి, లక్ష్మీ,శంకరం గారు, ప్రకాష్ మరియు మందిరం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

