ఇంటర్నేషనల్ వాసవి క్లబ్, వి 2o1 ఏ విశాఖ జిల్లా రీజియన్ టు జోన్ 2 వాసవి క్లబ్ ఎం వి పి కపుల్స్ ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది వారోత్సవాల సందర్భంగా ప్రాంతీయ అగ్నిమాపక అధికారి వారి కార్యాలయ సిబ్బందికి ఘన సన్మానం.. జోన్ 2 చైర్పర్సన్ ఏవీ రామకృష్ణారావు వాసవి ఎన్ , క్లబ్ అధ్యక్షులు వెంకట రమణమూర్తి తదితరులు.

విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : (సీనియర్ జర్నలిస్టు మానం శ్రీను మధురవాడ )
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్... వీ 201ఏ విశాఖపట్నం జిల్లా , రీజియన్ 2, జోన్ 2 , వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది వారోత్సవాలు సందర్భంగా ప్రాంతీయ అగ్నిమాపక అధికారి వారి కార్యాలయం నందు అగ్నిమాపక ఆఫీసు సిబ్బందికి అగ్ని ప్రమాదాలలో అత్యవసర పరిస్థితులలో సేవలు అందించి ప్రజలను రక్షిస్తున్న సిబ్బందికి కండువాలతో, వారి అధికారులకు కూడా సాలువల తో సత్కరించి, స్వీట్లు మరియు పండ్లు, గిఫ్ట్స్ ఇవ్వడం అయినది. ఈ యొక్క కార్యక్రమములో వాసవియన్స్ క్లబ్ అధ్యక్షులు వెంకటరమణమూర్తి, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గుప్త, కోశాధికారి నర్సింగరావు, గ్రంధి వాసుదేవ మూర్తి, జోన్ చైర్ పర్సన్ వెంకట రామకృష్ణారావు, పూర్వపు అధ్యక్షులు నర్సింగరావు పాల్గొన్నారు.