ఆరిలోవలో ఆర్యవైశ్య కుల దేవత శ్రీ శ్రీ శ్రీ కన్యకా పరమేశ్వరి నూతన ఆలయ నిర్మాణానికి ముఖ్య అతిథిగా విచ్చేసి శంకుస్థాపన చేసిన వాసవి క్లబ్ విశాఖ జిల్లా గవర్నర్ వంకాయల సాయినిర్మల, వాసవి క్లబ్ విక్టరీ ఆరిలోవ అధ్యక్షులు వాసవి యన్ పులపర్తి శివప్రసాద్. క్లబ్ సభ్యులు.

ఆరిలోవ లో వాసవి మాత నూతన ఆలయ నిర్మాణానికి నికి శంకు స్థాపన మహోత్సవం. విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) జై వాసవి ఆరిలోవ లో వాసవి జిల్లా V201A లో గల వాసవి క్లబ్ విక్టరీ ఆరిలోవ మరియు శ్రీ వాసవి మాత ఆరిలోవ ఆర్య వైశ్య సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఆర్యవైశ్య కులదేవత శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి నూతన దేవాలయ శిలాన్యాస మహోత్సవం ఘనంగా జరిగినది. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ వాసవియన్ విద్యా సంకల్ప శ్రేయోభిలాషి సాయి నిర్మల వంకాయల ,వాసవి క్లబ్ విక్టరీ ఆరిలోవ అధ్యక్షులు వాసవియన్ పులవర్తి శివప్రసాద్ మరియు క్లబ్ సభ్యులు, ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు జిల్లుడిమూడి శ్రీనివాసరావు, సంఘ సభ్యులు, జిల్లా నాయకులు,ఇతర అధికారులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.