విశాఖ, అక్కిరెడ్డిపాలెం రామాలయం కళ్యాణ మండపంలో శంకర్ ఫౌండేషన్ గవర్నర్ వంకాయల సాయినిర్మల సహాయ సహకారంతోఉచిత మెగా కంటి వైద్య శిబిరం. అక్కిరెడ్డిపాలెం, నాతయ్యపాలెం వారి ఆధ్వర్యంలో , శంకర్ ఫౌండేషన్ తో పాటు ఎలీట్ డెంటల్ హాస్పిటల్, మల్టీస్పెషాల్టీ హాస్పిటల్ వారి సహాయ సహకారంతో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు ముఖ్య అతిథి , ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ వి 2o1 ఏ గవర్నర్ వంకాయల సాయినిర్మల రిబ్బన్ కట్ చేసి వైద్య శిబిరం ప్రారంభం.

విశాఖపట్నం, (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ :సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) వాసవి క్లబ్ విశాఖజిల్లా వి201ఏ గవర్నర్ పర్యటనలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు.....మెగా మెడికల్ క్యాంప్ -----------------తేదీ 04.04.2026, శనివారం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సూచనల మేరకు వాసవి జిల్లా వి201ఏ గవర్నర్ పర్యటనలో భాగంగా అక్కిరెడ్డిపాలెం రామాలయంలో ఉన్న కల్యాణమండపంలో వాసవిక్లబ్ అక్కిరెడ్డిపాలెం,నాతయ్యపాలెం వారి ఆధ్వర్యంలో శంకర పౌండేషన్ వారి సహాయ సహకారాలతో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం,ఎలీట్ డెంటల్ హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంతో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ వి 201A గవర్నర్ వంకాయల సాయినిర్మల చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా సాయి నిర్మల మాట్లాడుతూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V 201A అఫీషియల్ విజిట్లో భాగంగా వాసవిక్లబ్ అక్కిరెడ్డిపాలెం,నాతయ్యపాలెం వారు చేసే సేవా కార్యక్రమాల పట్ల సంతోషం వ్యక్తపరిచారు. అలాగే రీజియన్ లో ఉన్న క్లబ్ లు కూడా అనేక సేవలు కార్యక్రమం లు చేస్తున్నారని వారందరు ముందు ముందు మరెన్నో సేవలు కార్యక్రమలు చేయాలని మన ఆర్యవైశ్యులకు, రీజియన్ కు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కొనియాడారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పద్మావతి, కోశాధికారి చెరుకు కృష్ణ, జిల్లా కార్యదర్శి రమణి ,ప్రోగ్రాం కమిటీ చైర్మన్ జి కుమార్ స్వామి, డాక్టర్లు గొర్ల సత్యనారాయణ, ఏ ప్రతిభ, ఏ కిషోర్ బాబు,వాసవిక్లబ్ అక్కిరెడ్డిపాలెం,నాతయ్యపాలెం సంఘ సభ్యులు ప్రెసిడెంట్ పి రవిశంకర్, సెక్రెటరీ ఎన్ వి ఎస్ మూర్తి, ట్రెజరర్ బండి ప్రసన్న కుమార్, జిల్లా అధికారులు వంకాయల రాంగోపాల్, ఉద్దగిరి కుమార్ గుప్తా, నన్ను గాంధీగుప్త, వరదకృష్ణ,కే.సుబ్బారావు, చెరుకు వెంకటరమణ, పిసి వరద కామేశ్వరరావు, కాశీ విశ్వనాథ్. తదితరులు పాల్గొన్నారు.