వాసవి మాత శోభాయాత్ర. ఆర్కే బీచ్ పాండురంగ టెంపుల్ నుండి కాళీమాత గుడి వరకు అంగరంగ వైభవంగా సాగిన శోభాయాత్ర. మహాయజ్ఞం. ప్రతి పౌర్ణమి రోజు జరిగే ఈ శోభాయాత్రలో భాగంగా విశాఖ జిల్లా గవర్నర్ వంకాయల సాయినిర్మల, ముఖ్య అతిథిగా కంకటాల ప్రభాకర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సేవా కార్యక్రమాల పోస్టర్ ఆవిష్కరించారు.

విశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : (సీనియర్ జర్నలిస్టు మానం శ్రీను మధురవాడ ) .వాసవి క్లబ్ ఇంటర్నేషనల్.. వి 201ఏ విశాఖపట్నం జిల్లా ప్రియతమ గవర్నర్ వంకాయల సాయి నిర్మల గారి సంకల్పించుకున్న *వాసవి మాత శోభాయాత్ర* *మహా యజ్ఞం"ప్రతి పౌర్ణమి రోజున వాసవీ మాత శోభాయాత్ర కార్యక్రమం"... తేదీ 01.04.26 బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఈ పరాభవ నామ సంవత్సరం చైత్రమాసంలో తొలి చైత్ర పౌర్ణమి శోభాయాత్ర వాసవి క్లబ్ విశ్వవాసవి, వాసవి క్లబ్ అమృత వాసవి మరియు వాసవి క్లబ్ కంచర పాలెం క్లబ్ కలసి సంయుక్తంగా చేస్తున్న ఈ శోభాయాత్ర(నాల్గవది)కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన కంకటాల ప్రభాకర్ గారు మరియు జిల్లా గవర్నర్ వంకాయల సాయి నిర్మల పల్లకిలో ఉన్న వాసవి మాతకు పూజలు నిర్వహించి హారతులిచ్చి, ప్రారంభించారు.* తదనంతరం ఏప్రిల్ నెలలో చేయవలసిన సేవా కార్యక్రమంల పోస్టర్ ముఖ్య అతిథి కంకటాల ప్రభాకర్ గారు చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ శోభాయాత్ర *ఆర్.కే బీచ్ పాండురంగ స్వామి మందిరం నుండి* మేళ తాళాలు, మహిళల కోలాటం,వాసవి మాత మూల మంత్రం పారాయణ, భక్తి గీతములు ఆలాపన చేస్తూ అంగరంగ వైభవంగా కాళీమాత గుడి వరకు తీసుకొనివెళ్ళి మరల పాండురంగ స్వామి ఆలయం నకు తీసుకొచ్చినారు.జిల్లా ఆధ్యాత్మిక ఇంచార్జ్ ముత్తా సతీష్ ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ ఛైర్పర్సన్ పి వి ఎస్ ఆర్ మూర్తి గారి సహాయ సహకారం తో నిర్వహించిన ఈ శోభాయాత్ర లో క్యాబినెట్ ప్రధాన కార్యదర్శి పద్మావతి, కోశాధికారి చెరుకు కృష్ణ, ఐ ఇ సీ ఆఫీసర్స్,వైస్ గవర్నర్లు, రీజియన్ చైర్ పర్సన్స్, రీజియన్ సెక్రటరీస్, జోన్ చైర్ పర్సన్స్,వివిధ క్లబ్బుల అధ్యక్షులు మరియు అధిక సంఖ్యలో సబ్యులు పాల్గొన్నారు.