ఘనంగా వాసవి మాత శోభాయాత్ర. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం జిల్లా వి 2o1 ఏ విశాఖపట్నం సంయుక్తంగా వారి ఆధ్వర్యంలో అమ్మవారి శోభాయాత్ర ఘనంగా జరిగింది.

జై వాసవి ...జై జై వాసవి విశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ) శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా తేదీ 26.04.2026 ఆదివారం ఉదయం 6 గంటలకు డిస్ట్రిక్ట్
V201A విశాఖపట్నం మరియు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థాన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో అమ్మవారి శోభాయాత్ర 102 కలశములతో మరియు డిస్ట్రిక్ట్ V201A తరుపున 102 రకముల సారెతో మేళతాళాలతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమములో గవర్నర్ వాసవియన్ విద్యాసంకల్ప స్టార్ కేసీజిఎఫ్ వంకాయల సాయినిర్మల, వి 201ఏ జిల్లా పదాధికారులు, వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గుప్తా, కోశాధికారి నర్సింగరావు , పూర్వపు అధ్యక్షులు మల్లేశ్వర గుప్తా, వాసుదేవ మూర్తి మరియు వివిధ క్లబ్బుల అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శిలు,కోశాధికారులు పాల్గొన్నారు.