భగవాన్ శ్రీ సత్య సాయి దివ్య ఆశీస్సులతో ఎం వి వి సిటీ సత్య సాయి సెంటర్ భజన మండలిఆధ్వర్యంలో సప్తగిరి కాలనీ హైవే బస్టాప్ వద్ద మజ్జిగ పంపిణీ చలివేంద్రాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన సత్యసాయి సేవా సంస్థల విశాఖ జిల్లా అధ్యక్షులు పి ఆర్ ఎస్ ఎన్ నాయుడు. సత్యసాయి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు . కృషి చేయాలి--- మానవ జాతికి గొప్ప ఆదర్శప్రాయుడు సత్యసాయి.

విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, విశాఖపట్నం జిల్లా, పి ఎం పాలెం ,శ్రీ సత్యసాయి సేవా సమితి , ఎంవీవీ సిటీ శ్రీ సత్యసాయి సెంటర్ ఆధ్వర్యంలో తేదీ 26.04.2026 ఆది వారం ఎంవీవీ సిటీ బస్సు స్టాప్ వద్ద *చలివేంద్రం* *(మజ్జిగ పంపిణీ)* సేవా కార్యక్రమాన్ని విశాఖ జిల్లా అధ్యక్షులు పి ఆర్ ఎస్ ఎన్ నాయుడు గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా , తన సంస్థాగత విషయాలు తెలియచేసి,ఎంవీవీ సిటీ చేస్తున్న సేవా కార్యక్రమాలు గురించి కొనియాడారు.తదనంతరం దాహార్తులకు మజ్జిగ పంపిణీ సేవా కార్యక్రమం ప్రారంభించినారు. తదనంతరం ఎంవీవీ సిటీ శ్రీ సత్యసాయి సెంటర్ సభ్యులు అందరూ పాల్గొని దాహార్తిని తీర్చుకొనుటకు వచ్చిన వారికి మజ్జిగ పంపిణీ చేశారు..ఈ కార్యక్రమంలో సిటీ సమితి కన్వీనర్ సాయికుమార్,ఎండాడ భజన మండలి కన్వీనర్ వెంకట రామకృష్ణారావు,ఎంవీవీ సిటీ సాయి సెంటర్ నిర్వాహకులు శివాజీ, రామినాయుడు ,శ్రీనివాస్ మరియు సాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.