లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్.. విశాఖ జిల్లా. లైన్స్ క్లబ్ స్కైప్ పార్క్ ఎండాడ వారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ, బాటసారిలకు వేసవి దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ప్రారంభించిన ముఖ్య అతిథి వైశాకి డెవలపర్ సత్య ప్రసాద్. లైన్స్ క్లబ్ అధ్యక్షులు వెంకటప్రసాద్.
April 25, 2026
విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్... విశాఖపట్నం జిల్లా, లైన్స్ క్లబ్ స్కై పార్క్, ఎండాడ వారి ఆధ్వర్యంలో తేదీ 25.04.2026 శనివారం వైశాకి స్కై పార్క్ మెయిన్ గేట్ దగ్గర చలివేంద్రం మజ్జిగ పంపిణీ సేవా కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వచ్చిన వైసాకి డెవలపర్స్ శ్రీ సత్య ప్రసాద్ గారుకు స్కై పార్క్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు వెంకట ప్రసాద్ కండువా వేసి ఆహ్వానించినారు. ముందుగా ముఖ్యఅతిథి దాహార్తులకు మజ్జిగ పంపిణీ ప్రారంభించారు. తదనంతరం క్లబ్ ప్రధాన కార్యదర్శి సీతారామరాజు, కోశాధికారి శాస్త్రి , ఉపాధ్యక్షులు రమేష్ మరియు క్లబ్ సభ్యులు అందరూ పాల్గొని దాహార్తిని తీర్చుకొనుటకు వచ్చిన వారికి ఈ మజ్జిగ పంపిణీ చేసినారు.లయన్ వేణు గారు ఆర్ధిక సహాయం తో ఈ దినం మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది.

