ఎండాడ సత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన సత్యసాయి సేవా సంస్థలు విశాఖ జిల్లా అధ్యక్షులు పి ఆర్ ఎస్ ఎన్ నాయుడు
April 28, 2026
శ్రీ సత్యసాయి సేవా సంస్థలు,
విశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ :( సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) జిల్లా ...శ్రీ సత్యసాయి భజన మండలి ..ఎండాడ ఆధ్వర్యంలో తేదీ 28.04.2026 మంగళ వారం నాడు ఎండాడ బస్సు స్టాప్ వద్ద *చలివేంద్రం* *(మజ్జిగ పంపిణీ)* సేవా కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా అధ్యక్షులు శ్రీ పి ఆర్ ఎస్ ఎన్ నాయుడు గారు జ్యోతి ప్రజ్వలన చేసి , సంస్థగతంగా సభ్యులందరూ కలిసిమెలిసి 45 రోజులు ఈ చలి కేంద్ర కార్యక్రమం మరియు ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.తదనంతరం దాహార్తులకు జిల్లా అధ్యక్షులు, సిటీ సమితి కన్వీనర్ శ్రీ సాయికుమార్, భజన మండలి కన్వీనర్ వెంకట రామకృష్ణారావు,మరియు మందిరం ఇన్చార్జి కృష్ణారావు లు మజ్జిగ పంపిణీ సేవా కార్యక్రమం ప్రారంభించినారు. తదనంతరం మందిరం సభ్యులు అందరూ పాల్గొని దాహార్తిని తీర్చుకొనుటకు వచ్చిన వారికి 160 లీటర్ల మజ్జిగ పంపిణీ చేసినారు.ఈ కార్యక్రమంలో అప్పలనాయుడు మాస్టర్, రామచంద్ర రావు,గోపి, మహేశ్వరరావు, శంకరం, ప్రకాష్, నాగవేణి, కనకమహాలక్ష్మి,భవాని,సరస్వతి, మరియు సేవాదళ్ సభ్యులు, సాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


