శ్రీ శ్రీ శ్రీ సరి పోలమ్మ అమ్మవారి సినిమాను సంబరాల్లో చిన్న శ్రీను సోల్జర్ అధ్యక్షురాలు సిరమ్మ. సమాజ సేవతో పాటు ఆధ్యాత్మిక సేవలో సిరమ్మ.

*శ్రీ శ్రీ శ్రీ సరిపోలమ్మ అమ్మవారిసిరిమాను సంబరాల్లో సిరమ్మ* బొబ్బిలి---- ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ) తేదీ:28.04.2026, బొబ్బిలి, 28 ఏప్రిల్ 2026: బొబ్బిలి నియోజకవర్గం, బొబ్బిలి మండలం, బొబ్బిలిలో కొలువైవున్న శ్రీ శ్రీ శ్రీ సరే పోలమ్మ అమ్మవారి సిరిమాను మహోత్సవం శ్రీ చోడిగంజి రమేష్ నాయుడు, ఆణువంశిక ధర్మ కర్త ఆధ్వర్యంలో మంగళవారం అంగరంగ వైభవంగా జరిగాయి . చోడిగంజి రమేష్ నాయుడు ఆహ్వానం మేరకు ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజవర్గం సమన్వయకర్త గౌ!! *శ్రీ మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) గారి కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ* శ్రీ శ్రీ శ్రీ సరే పోలమ్మ అమ్మ వారి సిరిమాను సంబరాలులో పాల్గొన్నారు. ఈ సంబరాల్లో పాల్గొన్న సిరమ్మకు చోడిగంజి రమేష్ నాయుడు, సరే పోలమ్మ అమ్మవారి ఉత్సవ కమిటీ సభ్యులు మరియు స్థానిక ముఖ్య నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా శ్రీ సరే పాలమాంబ అమ్మ వారిని దర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పండితుల ఆశీర్వాదం పొందారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్య కర్తలు, భక్తులు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు ఉపాధ్యక్షుడు తోటవాసు, చిన్న శ్రీను సోల్జర్స్ తదితరులు పాల్గొన్నారు.