బ్రిటిష్ వారిని గడగడలాడించిన మన్యం విప్లవ వీరుడు అల్లూరి--- సిపిఐ ఆధ్వర్యంలో అల్లూరి 102 వా వర్ధంతిలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మరుపల్లి పైడ్రాజు.
May 08, 2026
.
సిపిఐ ఆధ్వర్యంలో అల్లూరి 102 వ వర్ధంతి.
భీమిలి నియోజకవర్గం ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
గిరిజనులను చైతన్యం చేసి బ్రిటిషు పాలకులను ఎదిరించి సాయుధ పోరాటం నడిపిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుదు మరుపిళ్ల పైడిరాజు పేర్కొన్నారు. అల్లూరి 102 వ వర్ధంతి సందర్బంగా గురువారం సిపిఐ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి మధురవాడ గణేష్ నగర్ లో ఉన్న విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా పైడిరాజు మాట్లాడుతూ విశాఖపట్నం జిల్లా, పద్మనాభం మండలం పాండ్రంకి గ్రామంలో తన అమ్మమ్మ గారి ఇంట 1897 జూలై 4 జన్మించినారని, 1924 మే 7 ఉమ్మడి విశాఖ జిల్లా కొయ్యురు మండలం మంప గ్రామంలో బ్రిటిష్ వారు కాల్చి చంపారని తెలిపారు. భారత స్వాతంత్ర్య చరిత్రలో ఒక మహోజ్వల శక్తిగా అల్లూరి జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయమని, సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి అమాయక గిరిజనులను బ్రిటిష్ వారు పెడుతున్న చిత్రహింసలు చూసి వారితో మమేకమై ఎటువంటి ఆయుధాలు లేకుండా గిరిజన సంప్రదాయ విల్లంబుల తోనే దాదాపు రెండు సంవత్సరాలపాటు బ్రిటిష్ వారిని గడగడ లాడించి ప్రాణాలర్పించిన యోధుడని కొనియాడారు. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు అండగా ఉన్న గొప్ప స్వాతంత్ర సమర పోరాట యోధుడని నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బి కేశవయ్య, పి వి అప్పారావు, బెల్లాపు పాపారావు, సతీష్, అల్లు శంకరరావు, అప్పలరాజు, మహేష్,నాగరాజు, రవి తదితరులు పాల్గొన్నారు.
