వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ అంతర్జాతీయ కార్యదర్శి( అడ్మినిస్ట్రేషన్) శ్రీనివాస్ గుప్తా ఉమామహేశ్వరి దంపతుల పెళ్లిరోజు సందర్భంగా మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు

విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ :( సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) జై వాసవి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, వి 201 ఏ విశాఖపట్నం జిల్లా, వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో . వాసవి క్లబ్ అంతర్జాతీయ కార్యదర్శి (అడ్మినిస్ట్రేషన్ ) *వాసవియన్ విద్యాసంకల్ప కె సి జి ఎఫ్ శ్రీనివాసరావు గుప్తా మరియు వాసవియన్ ఉమామహేశ్వరి దంపతుల పెళ్ళిరోజు* శుభ సందర్భముగా ఈ దినం శుక్రవారం ఉదయం ఎండాడ పోలీస్ స్టేషన్ ప్రక్క ,ఎండాడ బస్టాప్ (BUS BAY) దగ్గర చల్లని మజ్జిగ చలివేంద్రము ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు వాసవియన్ వెంకటరమణమూర్తి, జోన్ చైర్ పర్సన్ వాసవియన్ వెంకట రామకృష్ణారావు,ప్రధాన కార్యదర్శి వాసవియన్ చంద్రశేఖర గుప్తా, కోశాధికారి వాసవియన్ నరసింగరావు, ప్రోగ్రామ్ చైర్ పర్సన్ వాసవియన్ శివరామకృష్ణ, పూర్వపు అధ్యక్షులు వాసవియన్ గ్రంధి కృష్ణారావు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.