విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: (సీనియర్ జర్నలిస్టు మానం శ్రీను మధురవాడ)అంతర్జాతీయ వాసవి క్లబ్స్ జిల్లా వి.201ఏ నిర్వహిస్తున్న 8 రోజుల అవగాహన మరియు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ( తేదీ 24.05.2026 నుండి 31.05.2026 వరకు ఆన్లైన్ లో జరుగుతున్న) “సైబర్ దాడులు మరియు సైబర్ భద్రత అవగాహన” కార్యక్రమం విజయవంతంగా జరిగింది.ఈ కార్యక్రమంలో సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, హ్యాకింగ్ విధానాలు, డిజిటల్ భద్రతా చర్యలు మరియు వ్యక్తిగత & సంస్థల డేటాను రక్షించుకునే మార్గాలపై విస్తృత అవగాహన కల్పించారు.వక్తలు ప్రస్తుత కాలంలో జరుగుతున్న సైబర్ దాడులపై ప్రత్యక్ష ఉదాహరణలతో ఎంతో స్పష్టంగా వివరించి, జాగ్రత్తలు మరియు నివారణ చర్యలను సులభంగా అర్థమయ్యే విధంగా తెలియజేశారు. ఈ కార్యక్రమం సభ్యులందరికీ ఎంతో ఉపయోగకరంగా మరియు అవగాహన కలిగించేలా నిలిచింది.ఇలాంటి సమాజ ప్రయోజన కార్యక్రమాలకు ప్రోత్సాహం అందిస్తున్న అంతర్జాతీయ అధ్యక్షులు శ్రీ సిద్ధా వెంకట సూర్య ప్రకాశరావు గారికి (సిద్ధా గారు) హృదయపూర్వక కృతజ్ఞతలు.ఈ విలువైన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన వాసవియన్ వంకాయల నిర్మల గారికి, జిల్లా గవర్నర్ వి201ఏ ప్రత్యేక ధన్యవాదాలు.అలాగే 8 రోజుల కార్యక్రమాల ప్రాముఖ్యతను సభ్యులకు వివరించి ప్రోత్సహించిన దరిశి శ్రీనివాస్ గారు, సెంథిల్ కుమార్ గారు, ఏ.వి.ఎస్. ఎన్ .గుప్తా గారు మరియు వేద మధుసూదన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.సైబర్ భద్రతపై అద్భుతమైన మరియు ఉపయోగకరమైన సెషన్ అందించిన డా. పి. సతీష్ గారు, డా. జి. సువర్ణకుమార్ గారు మరియు శ్రీ ఎం. వంశీకృష్ణ గారికి హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు.వారి సేవాభావం మరియు సమిష్టి కృషితో ఈ కార్యక్రమం ఘన విజయాన్ని సాధించింది.