ఉత్తరాంధ్ర జిల్లాలలో వైసిపి ,బంధువులు,అభిమానుల పలు శుభ కార్యక్రమాలకు వెళ్లి తమ ఆశీర్వాదం అందిస్తున్న విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి చిన్న శ్రీను. పలు శుభకార్యాలలో కార్యకర్తల కష్టసుఖాలలో పాల్గొని ముందుకు దూసుకుపోతున్న చిన్న శ్రీను.

విజయనగరం, ప్రజా బలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ)
తేదీ: 16-05-2026*
*📍గంట్యాడ మండలం,జామి మండలం*

*రజస్వల శుభకార్యాల్లో పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన చిన్న శ్రీను .

గజపతినగరం నియోజకవర్గం, గంట్యాడ మండలం, కోటారుబిల్లి గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన శ్రీ వర్రి కిషోర్ నాయుడు , కుమార్తె రజస్వల శుభకార్యానికి విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు చిన్న శ్రీను హాజరై ఆశీర్వదించారు.

అలాగే జామి మండలం, కుమరాం గ్రామంలోని శ్రీ దేవి కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన శ్రీ నెక్కలి సుమన్ గారి కుమార్తె రజస్వల శుభకార్యానికి హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా చిన్న -శ్రీను కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడి, చిన్నారులకు ఉజ్వల భవిష్యత్తు కలగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.