మండిపోతున్న పెట్రోల్ ,డీజిల్ ధరలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయాలి.---ఏఐటీయూసీ, సిపిఐ డిమాండ్.

పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు రద్దు చేయాలి - సిపిఐ, ఏఐటీయూసీ డిమాండ్ 
విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ)             
కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారం పడే విధంగా లీటర్ పెట్రోల్ పై రూ" 3.29, డీజిల్ పై రూ" 3.14 పెంచడానికి తీవ్రంగా ఖండిస్తూ సిపిఐ, ఏఐటీయూసీ ఆటో కార్మికుల ఆధ్వర్యంలో ఆదివారం కొమ్మాది జంక్షన్ లో ఆటోకి తాడుకట్టి లాగుతూ నిరసన నిర్వహించారు. ఈ నిరసనను ఉద్దేశించి సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి ఎస్ కె రహిమాన్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఒక పక్క కార్పొరేటు సంస్థలైన ధనవంతులకు రాయితీలు కల్పిస్తూ సామాన్య ప్రజలపై బారాలు మోపు తున్నారని తీవ్రంగా విమర్శించారు. 
పెట్రో ఉత్పత్తులు నిల్వలో ఉన్నాయని చెబుతూనే ఈ విధంగా ధరలు పెంచడం ప్రజలంతా తీవ్రంగా వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు. 
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఓట్లేసి రాష్ట్రాల్లో బిజెపి గెలిచి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ప్రజలకు మీరు ఇచ్చిన బహుమతులా అని ప్రశ్నించారు. వ్యాపార వర్గాలకు ఎకరా భూమి 99 పైసలకే కట్టబెడుతూ ప్రజలు వాడే అన్ని నిత్యవసర వస్తువుల ధరలు పెరిగే విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం ఎంతవరకు సమంజసం మన్నారు. తక్షణం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 
కరోనా సమయములో క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోయినప్పటికీ మోడీ ప్రభుత్వం ధరలు తగ్గించవలసింది పోయి పెట్రోల్ డీజిల్ ధరలను 100 పెంచి మరలా ఇప్పుడు భారీగా భారాలు మోపడాన్ని సహించబోమన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు రద్దు చేయకపోతే ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. 
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం పైడిరాజు, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఎం డి బేగం, ఏరియా కార్యదర్శి వి సత్యనారాయణ ఆటో కార్మికసంఘం నాయకులు బి అప్పలరాజు, కె శ్రీను, మోహన్, ఎం శ్రీను తదితరులు పాల్గొన్నారు.