ఏపీలో భారీగా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి. భీమిలి నియోజకవర్గంలో వైసీపీ ఇంచార్జ్ మజ్జి చిన్న శ్రీను ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. అనంతరం ఆర్డీవోకు వినతి పత్రం.

(భీమిలి నియోజకవర్గం, ప్రజా బలం న్యూస్ ఆన్లైన్; సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ)
 ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధిక పెట్రోలు ధరలు – ప్రజలపై చంద్రబాబు కూటమి ప్రభుత్వ భారం.- భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త చిన్న శ్రీను .

పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని మేనిఫెస్టో హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలి అని మాజీ ముఖ్యమంత్రివర్యులు, వైయస్సార్ సిపి పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పెట్రోలు, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూభీమిలి హెడ్ క్వార్టర్స్‌లోని నూకాలమ్మ స్టేజ్ వద్ద నుండి ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి, ఆర్డీవో కి వినతిపత్రం అందజేసిన. విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పాల్గొన్నారు.

వారితోపాటు ఈ కార్యక్రమంలో కుమార్తె *శ్రీమతి మజ్జి సిరి సహస్ర (సిరమ్మ) నియోజవర్గ పరిశీలికలు తైనాల విజయ్ కుమార్ పాల్గొన్నారు..

చిన్న శ్రీను గారు మాట్లాడుతూ..
రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని.
ఎన్నికల ముందు పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, నారా లోకేష్‌లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను పూర్తిగా విస్మరించారని విమర్శించారు. ప్రజలకు ఉపశమనం కల్పించడం బదులు “బాదుడే బాదుడు” పాలన కొనసాగిస్తూ సామాన్య ప్రజలపై అదనపు భారాలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర రూ.113.62, డీజిల్ ధర రూ.101.24కు చేరడం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధిక వ్యాట్ విధించడం వల్లే దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్నాయని తెలిపారు.
లీటర్ పెట్రోల్ పై 31% వ్యాట్‌తో పాటు రూ.4 అదనపు పన్ను, మరో రూ.1 రోడ్ డెవలప్మెంట్ సెస్ రూపంలో వసూలు చేస్తున్నారని తెలిపారు. అదే విధంగా డీజిల్ పై 22.25% వ్యాట్‌తో పాటు అదనపు భారం విధించడం వల్ల వాహనదారులు, రైతులు, రవాణా రంగం తీవ్రంగా నష్టపోతున్నాయని పేర్కొన్నారు.

 పెరిగిన ధరల కారణంగా రాష్ట్ర ప్రజలపై ఏడాదికి సుమారు రూ.3,391 కోట్ల అదనపు భారం పడనుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్ పై రోజుకు రూ.3.29 కోట్లు, డీజిల్ పై రూ.6 కోట్ల మేర అదనపు భారం పడుతోందని తెలిపారు.

ప్రపంచ మార్కెట్ పరిస్థితులను కారణంగా చూపుతూ ప్రజలకు సైకిళ్లు వాడాలని, కార్ పూలింగ్ చేయాలని సూచించడం బాధ్యతారాహిత్య వ్యాఖ్యలకు నిదర్శనమని చిన్న శ్రీను గారు విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం బదులు ప్రజలపై భారాలు మోపడం చంద్రబాబు ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు.
ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లా & నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, మండల పార్టీ కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, మహిళా ప్రతినిధులు, వార్డు సచివాలయ కమిటీ అధ్యక్షులు, సోషల్ మీడియా కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మధురవాడ ఏరియా నుండి పోతిన శ్రీనివాసరావు, పోతిన హనుమంతరావు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.