పి ఎం పాలెం చివర బస్ స్టాప్ రామాలయం వద్ద ఘనంగా హనుమాన్ జయంతి. ప్రత్యేక పూజలు చేసిన భీమిలి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి చిక్కాల. అన్నదాన కార్యక్రమం ప్రారంభోత్సవం చేసిన విజయబాబు.

పిఎం పాలెంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొన్న భీమిలి ఇంచార్జి చిక్కాల విజయబాబు ప్రత్యేక పూజలు,ఘనంగా అన్నసంతర్పణ.... మూడు వేలకు పైగా పాల్గొన్న భక్తులు... భీమిలి నియోజకవర్గం, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్( : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) జివిఎంసి ఆరో వార్డు పరిధి పిఎం పాలెం రామాలయం సమీపంలో ఉన్న అభయ ఆంజనేయ ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు మంగళవారం ఉదయం నుండి ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి మూలవిరాట్ విగ్రహానికి ప్రత్యేక అభిషేకాలు , పూజ కార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా ఆలయ ఆవరణలో అభయ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు చేపట్టిన అన్నసంతర్పణ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా భీమిలి టిడిపి ఇంచార్జి చిక్కాల విజయబాబు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మూడు వేలకు పైగా భక్తులు పాల్గొన్నారు.అనంతరం చిక్కాల విజయబాబు చేతుల మీదుగా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయనను దుస్సలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి శ్రీనివాస్, ఆరో వార్డు టిడిపి అధ్యక్షుడు,కె వి ఆర్ క్యాటరింగ్ అధినేత గరే గురునాథ్, ఆలయ ధర్మకర్త కొప్పాక రామకృష్ణ,ఆరో వార్డు బిసి సెల్ అధ్యక్షుడు రెడ్డి సత్యనారాయణ,కొల్లి బాబ్జీ, పిల్లా రమేష్, పోతిన నాయుడు తదితరులు పాల్గొన్నారు.