*వైజాగ్ షావుకార్స్* నూతన వాసవి క్లబ్ ప్రారంభోత్సవం చేసిన అంతర్జాతీయ వాసవి క్లబ్ డైరెక్టర్ అమర్నాథ్.
May 12, 2026
నూతన వాసవి క్లబ్ "వైజాగ్ షావుకార్స్" ప్రారంభోత్సవం....
విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ :(:సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
అంతర్జాతీయ వాసవి క్లబ్స్ విశాఖపట్నం జిల్లా వి.201ఏ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ "వైజాగ్ షావుకార్స్" నూతనంగా ప్రారంభోత్సవం పబ్లిక్ లైబ్రరీ లో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన అంతర్జాతీయ డైరెక్టర్ అమర్నాథ్ గారు
వాసవి మాత కు జ్యోతి ప్రజ్వలన చేసి, పుష్పములు సమర్పించిన అనంతరం మాట్లాడుతూ కుల,మత, జాతి బేధభావం లేకుండా అనేక సాంఘిక, సామాజిక , సాంస్కృతిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఏకైక సేవా సంస్థ అంతర్జాతీయ వాసవి క్లబ్స్ అని అవసరమైన వారికి ఎపుడూ అందుబాటులో ఉంటామని సభాముఖంగా తెలియచేశారు. జిల్లా గవర్నర్ వాసవియన్ విద్యా సంకల్ప కె. సి. జి.ఎఫ్. శ్రేయోభిలాషి సాయి నిర్మల వంకాయల నూతన కార్యవర్గం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి, కోశాధికారి వనజా దేవి, లక్ష్మీ దేవి మరియు నూకేశ్వర రావు గార్ల చే ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్ సాయి నిర్మల మాట్లాడుతూ దేశ విదేశాలలో 1600 పైగా వాసవి క్లబ్స్ ఉన్నాయని అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ,
వి 201ఏ విశాఖపట్నం జిల్లాలో 80 కి పైగా క్లబ్బులు ఉన్నాయని సుమారు కోటి రూపాయల విలువకి పైబడి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, జిల్లాలో మరిన్ని నూతన క్లబ్బులు ప్రారంభిస్తున్నామని, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా
*మే నెల 30వ తేదీన* ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. గవర్నర్ గారి అనుమతితో వాసవి క్లబ్ ఎం.వి.పి.కపుల్స్ ఆధ్వర్యంలో ఈ క్లబ్ ను స్థాపించడం జరిగిందని ,వారికి మరియు ఈ క్లబ్బు ను స్థాపించుటలో ముఖ్య పాత్ర వహించిన మరియు సహకరించిన వైస్ గవర్నర్ వాసవియన్ చందన గారికి, ప్రాంతీయ అధికారి వాసవిఎన్ మానస గారికి మరియు ప్రతి ఒక్కరికి క్లబ్ అధ్యక్షుడు కాపుగంటి వెంకట రమణ మూర్తి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. తదనంతరం జిల్లా పదాధికారులు అందరికీ బహుమతులు ఇచ్చి సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత గా వ్యవహరించిన కార్యక్రమాల అధ్యక్షుడు పాలూరి శివరామకృష్ణ గారి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసినది. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ వైస్ ప్రెసిడెంట్ వాసవియన్ వేద మధుసూదన్ ,జిల్లా కార్యదర్శి పద్మావతి ,జిల్లా కార్యక్రమాల ఇంచార్జ్ రమణి, అసోసియేట్ కోశాధికారి వాసుదేవ మూర్తి, రీజియన్ కార్యదర్శి కమల్ కుమార్ , జోన్ ఛైర్పర్సన్ ఏ.వి.రామకృష్ణ రావు ,క్లబ్ కార్యదర్శి చంద్ర శేఖర్ గుప్తా, కోశాధికారి నరసింగరావు,రాంగోపాల్ , పూర్వపు అధ్యక్షులు , గోగుల నర్సింగరావు,గ్రంధి కృష్ణారావు, గంగాధర్,ఉప్పల ఆనందరావు మున్నగు వారు పాల్గొన్నారు.
