విశాఖ జిల్లా వాసవి క్లబ్ రీజియన్ 2, తొలి ప్రాంతీయ సమావేశం. ఐక్యమత్యంతో క్లబ్బులన్నీసేవలు విస్తృతం చేయాలి.వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్,విశాఖపట్నం జిల్లా వి 201ఏ – రీజియన్ 2 తొలి ప్రాంతీయ సమావేశం.విశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ) వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ విశాఖ వి 201 ఏ--రీజియన్-2 తొలి ప్రాంతీయ సమావేశం శుక్రవారం రీజియన్2 చైర్‌పర్సన్ వాసవియన్ టి. పద్మావతి (మానస) సమర్థ నాయకత్వంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ సమావేశం సమయానికి ప్రారంభమై, రీజియన్‌లోని అన్ని క్లబ్ అధ్యక్షులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వాసవియన్ . గోల్డెన్ *కె సి జి ఎఫ్ టి. అమర్నాథ్, ఇంటర్నేషనల్ ఎడిషనల్ ట్రెజరర్ (మల్టిపుల్) హాజరయ్యారు. ఈ సమావేశంలో జోన్ చైర్‌పర్సన్లు వాసవియన్ సత్యవాణి, వాసవియన్ ఎ.వి. రామకృష్ణారావు , రీజినల్ సెక్రటరీ వాసవియన్ గోగుల కమల్ కుమార్, అలాగే రీజియన్-2లోని అన్ని క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారులుపాల్గొన్నారు.రీజియన్ చైర్‌పర్సన్ వాసవియన్ టి. పద్మావతి (మానస ) సమావేశానికి అధ్యక్షత వహించారు. జోన్ చైర్‌పర్సన్లు తమ తమ జోన్ నివేదికలను సమర్పించగా, అన్ని క్లబ్ అధ్యక్షులు తమ క్లబ్ కార్యకలాపాలు , పురోగతి నివేదికలను పంచుకున్నారు.సభను ఉద్దేశించి మాట్లాడిన ముఖ్య అతిథి వాసవియన్ టి. అమర్నాథ్ , రీజియన్ చైర్‌పర్సన్, జోన్ చైర్‌పర్సన్లు క్లబ్ అధ్యక్షులు చేసిన సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వివిధ పథకాల గురించి వివరించి, క్లబ్ పరిపాలన మరియు సేవా కార్యక్రమాలను బలోపేతం చేయడంలో "డాన్ టు డెస్క్" భావన ప్రాముఖ్యతను వివరించారు.రీజినల్ సెక్రటరీ వాసవియన్ గోగుల కమల్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలిపారు. సమావేశం విలువైన చర్చలు మరియు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలతో విజయవంతంగా ముగిసింది.