వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం జిల్లా....
వి 201 ఏ, రీజియన్ 2,
జోన్ 1 వాసవి క్లబ్ వాల్తేర్ కపుల్స్ లో ఆధ్వర్యంలో*
వి హెల్త్ ...వి డెంటల్ కేర్ *సహకారంతో, *విశాఖపట్నం రోటరీ క్లబ్ సౌజన్యంతో... విశాఖపట్నంలో ఉన్న రక్త నిల్వల కేంద్రములలో వేసవికాలం వలన రక్త నిలవలు తగ్గి రక్త లభ్యత తగ్గుచున్న నేపథ్యంలో. సేవ కన్నా శ్వాసే ముఖ్యం అని భావించి మెగా రక్తదాన శిబిరం
నిర్వహించుటకు )అవకాశం ఇచ్చిన విశాఖపట్నం జిల్లా వాసవి క్లబ్స్ గవర్నర్ , ముఖ్యఅతిథి శ్రీమతి వంకాయల సాయినిర్మల , వంకాయల రాంగోపాల్ వచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రక్తదాతల నుండి రక్తం యూనిట్లు సేకరించి రక్త నిల్వల కేంద్రములకు ఇచ్చుటకు, ప్రజల నుండి రక్తం సేకరించి ప్రజలకు ఉపయోగపడే విధంగా సేవచేసి వాసవి క్లబ్లు , విశాఖపట్నం జిల్లాను మరింత ప్రగతి పథంలో ముందుకు తీసుకుని వెళ్లి పేరు తెచ్చే తరుణంలో నిర్ణయించి ఈ మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగిందని గవర్నర్ తెలిపినారు. ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపునకు అడ్వైజర్ గా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఎడిషనల్ కోశాధికారి (మల్టిపుల్) తమ్మన అమర్నాథ్ సూచనలు సలహాలు మేరకు రీజియన్ 2 చైర్ పర్సన్ తమ్మన మానస, ప్రోగ్రాం చైర్మన్ డివిఎస్ రామారావు లు సమన్వయంతో విజయవంతం చేశారు..ఈ మెగా బ్లడ్ క్యాంప్ లో సుమారు 50 మంది పై బడి రక్త దాతలు పాల్గొన్నారు.
వి. జవహర్ (131 వ సారి)
ఎం శ్రీనివాస్ (60 వ సారి),
కే. సురేష్ (49 వ. సారి),
నిరంజన్ ఆనంద్ (43 వ సారి), వెంకట రామకృష్ణారావు (30 వ సారి),తవ్వా సంపత్ (30 వ సారి) లు ఎక్కువ పర్యాయములు బ్లడ్ డొనేషన్ చేసి వాళ్ల సేవా తత్పరతను బ్లడ్ డోనర్లకు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ వాల్టేర్ కపుల్స్ అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శి, కోశాధికారులు సంపత్, ఆదిత్య, కిరణ్ లు , రీజియన్ 2,జోన్ 2 చైర్ పర్సన్స్ సత్యవాణి, వెంకట రామకృష్ణారావు లు పాల్గొన్నారు. ఈ మెగా బ్లడ్ క్యాంప్ విజయవంతం చేసిన వీ హెల్త్ కేర్ మరియు రోటరీ క్లబ్ విశాఖపట్నం వారికి, మరియు సహృదయంతో సేవాభావంతో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులో పాల్గొన్న ప్రతి వ్యక్తికి తమనమర్నాథ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మెగా క్యాంపు ఈ వారంలో రెండు ప్రాంతంలలో జరుగుతుందని. ఈ మెగా బ్లడ్ క్యాంప్ లో పాల్గొని వ్యక్తులు మరల నిర్వహించబోవు సెంటర్లలో పాల్గొనమని తెలియజేశారు.. ఈ మెగా బ్లడ్ క్యాంపులో జూలై ఫస్ట్ వారం వరకు వివిధ ప్రదేశములలో నిర్వహించబడతాయి. ఈ క్యాంపులు నిర్వహించుటకు ఆసక్తి ఉన్నవాళ్లు మరియు బ్లడ్ డొనేషన్ చేయుటకు ఆసక్తి ఉన్నవారు కూడా
ఈ క్రింది ఫోన్ నెంబర్లు సంప్రదించగలరు
Vn T Amarnath
Mobile: 9246562789
Vn D V S Ramarao
Mobile: 9393103003