విశాఖ.ఎంవిపి వాసవి క్లబ్ కపుల్స్ జోన్2 చైర్ పర్సన్ఏవిరామకృష్ణారావుఆధ్వర్యంలో తన కుమారుడు వివాహ వార్షికోత్సవం సందర్భంగాభీమిలి గొల్లల తాళ వలస లో మన కుటుంబం చిల్డ్రన్స్ హోమ్. అనాధ పిల్లల సంరక్షణ కేంద్రంలో గ్యాస్ స్టవ్ వితరణతోపాటు అన్నదానం.

విశాఖ సిటీ (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ)
జై వాసవి.... జై జై వాసవి..
తేదీ 11.06.2026 , గురువారం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, 
 వి 201A, రీజియన్ 2,
 జోన్ 2 వాసవి క్లబ్ కపుల్స్ ఆధ్వర్యంలో *గొల్లల తాళ్లవలస గ్రామం* *భీమునిపట్నం మండలం* నందు
*మన కుటుంబం చిల్డ్రన్ హోమ్* *అనాథ పిల్లల సంరక్షణ కేంద్రం* నందు గల 30 మంది విద్యార్థులు కు 
శ్రీమతి అండ్ శ్రీ భావన సాయి, స్వరూప్ వివాహం వార్షికోత్సవం సందర్భంగా భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. సంరక్షణ కేంద్రం కేర్ టేకర్ అర్చన ప్రసన్న అభ్యర్థన మేరకుబి పీజియన్ కంపెనీ గ్యాస్ స్టవ్, మరియు పిల్లలకు వాటర్ బాటిల్స్, స్నాక్స్ ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు, పూర్వపు అధ్యక్షులు, జోన్ 2 చైర్ పర్సన్ వాసవియన్ వెంకట రామకృష్ణారావు మరియు మహిళా సభ్యురాలు వాసవియన్ శ్రీమతి నాగవేణి పాల్గొన్నారు.