* జై వాసవి*...
* వాసవి క్లబ్ ఇంటర్నేషనల్..
వి 201ఏ విశాఖపట్నం జిల్లా ప్రియతమ గవర్నర్ వంకాయల సాయి నిర్మల గారి సంకల్పించుకున్న *వాసవి మాత శోభాయాత్ర* *మహా యజ్ఞం"ప్రతి పౌర్ణమి రోజున వాసవీ మాత శోభాయాత్ర కార్యక్రమం"లో భాగంగా తేదీ 31.05.26 ఆదివారం సాయంత్రం 5 గంటలకు వాసవి క్లబ్ గ్రేటర్ విశాఖ కపుల్స్ ఆధ్వర్యంలో ఈ శోభాయాత్ర(ఆరవది) జిల్లా గవర్నర్ వంకాయల సాయి నిర్మల మరియు క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు ,ముఖ్య సబ్యులు పల్లకిలో ఉన్న వాసవి మాతకు పూజలు నిర్వహించి హారతులిచ్చి, ప్రారంభించారు.*
ఈ శోభాయాత్ర *ఆర్.కే బీచ్ పాండురంగ స్వామి మందిరం నుండి* మేళ తాళాలు, మహిళల కోలాటం,వాసవి మాత మూల మంత్రం పారాయణ, భక్తి గీతములు ఆలాపన చేస్తూ అంగరంగ వైభవంగా
కాళీమాత గుడి వరకు తీసుకొనివెళ్ళి మరల పాండురంగ స్వామి ఆలయం నకు తీసుకొచ్చినారు.జిల్లా ఆధ్యాత్మిక ఇంచార్జ్ ముత్తా సతీష్ , ప్రోగ్రాం చైర్ పర్సన్ వేగా సతీష్ నిర్వహణలో *ఎస్ వి ఎస్ చిట్స్* సహకారం తో నిర్వహించిన ఈ శోభాయాత్ర లో క్యాబినెట్ ప్రధాన కార్యదర్శి పద్మావతి, గరుడ రమణి, క్లబ్బు అధ్యక్షులు సురేష్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికా రాజేష్ మరియు ఐ ఇ సీ ఆఫీసర్స్,వైస్ గవర్నర్లు, రీజియన్ చైర్ పర్సన్స్, రీజియన్ సెక్రటరీస్, జోన్ చైర్ పర్సన్స్,వివిధ క్లబ్బుల అధ్యక్షులు మరియు అధిక సంఖ్యలో సబ్యులు పాల్గొన్నారు.