విశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ)
ఓం శ్రీ సాయిరాం...
భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఏప్రిల్ 28వ తేదీ న మంగళవారం ఎండాడ శ్రీ సత్యసాయి మందిరం ద్వారా ఎండాడ బస్ బే వద్ద ప్రారంభించిన *చలివేంద్రం* *మజ్జిగ పంపిణీ సేవా కార్యక్రమం* మందిరం సభ్యులు సహాయ సహకారాలు,అదేవిధంగా అనేక మంది వ్యక్తులు ఈ సేవా కార్యక్రమానికి దాతలు గా సహకారంతో తేదీ 14.06.2026 ఆదివారం వరకు నిరాటంకంగా, నిర్విఘ్నంగా ,విజయవంతం చేసినందులకు అందరికీ పేరు పేరు నా
ప్రత్యేక కృతజ్ఞతలు 🙏 తెలుపుకుంటూ.... ఈ చలివేంద్రం (మజ్జిగ పంపిణీ)సేవాకార్యక్రమం ఈ దినము తేదీ 14.06.2026 ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమై 11 గంటల 30 నిమిషాలకు నామ సంకీర్తన, తదనంతరం స్వామి వారికి మంగళహారతి తో ముగింపు జరిగింది.ఈ దినం ముగింపు కార్యక్రమం సందర్భంగా ప్రత్యేకించి బాల వికాస్ పిల్లలచే దాహార్తులకు మజ్జిగ , పులిహోర ,అరటిపళ్ళు ప్రసాదం పంపిణీ చేయడం జరిగింది . ఈ చలివేంద్రం నిర్వహించిన 48 రోజులు సుమారు 45000 మంది దాహార్తులకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది.మందిరం కన్వీనర్ వెంకట రామకృష్ణా రావు మాట్లాడుతూ స్వామి మనకు ఇచ్చిన అవకాశం మేరకు ఇలాంటి సేవా కార్యక్రమాలు సభ్యులు అందరూ కలసి మెలసి ఇంకా ఎన్నో చెయ్యాలని కోరారు.ఈ కార్యక్రమంలో మందిరం ఇంచార్జ్ కృష్ణారావు, గ్రూప్ లీడర్స్ అప్పలనాయుడు మాస్టారు ,నాగవేణి ,గోపి ఆధ్యాత్మిక కోఆర్డినేటర్స్ రామచంద్ర రావు, పద్మజ, బాలవికాస్ టీచర్లు రఘునందన రాజు,శ్యామల, యూత్ ఇన్చార్జి గాయత్రి,మందిరం సబ్యులు , భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సదా
శ్రీ సత్యసాయి పద సేవలో 🙏