ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగ సందర్భంగా వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో శివాజీ పార్కులో యోగాసనాలు. సూర్య నమస్కారాలు,వాసవి ఎన్. ఎంవిపి కపుల్స్ పూర్వపు అధ్యక్షులు గ్రంధి కృష్ణారావుకి సన్మానం. జోన్ టు చైర్పర్సన్ ఏవి కృష్ణారావు పర్యవేక్షణ.

జై వాసవి ..జై జై వాసవి...🙏
వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో ఈ దినము ఆదివారం,తేదీ 21.06.2026 *ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా* సందర్భంగా క్లబ్బు సభ్యులు
 *శివాజీ పార్క్* లో 
 ఉదయం 5 గంటల 30 నిమిషాలకు కు ప్రారంభమై సుమారు 8 గంటల వరకు యోగాసనాలు,సూర్య నమస్కారములు నిర్వహించటం జరిగింది.తదనంతరం యోగ గురువులు మరియువాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ పూర్వ అధ్యక్షులు వాసవియన్ గ్రంధి కృష్ణారావు గారికి కండువాతో సత్కరించడం జరిగింది.ఈ కార్యక్రమం లో రీజియన్ 2 జోన్ 2 చైర్ పర్సన్ వెంకట రామకృష్ణారావు,క్లబ్ అధ్యక్షులు వాసవియన్ వెంకటరమణమూర్తి, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గుప్త, కోశాధికారి నర్సింగరావు పూర్వపు అధ్యక్షులు నరసింహారావు ,సన్యాసి రాజు మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.