విశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఛానల్:( సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ (సెల్ నెంబర్9502817542)
ఓం శ్రీ సాయిరాం...
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో సర్కులర్ నెంబర్ 16/2026 *బ్యాక్ టు బేసిక్స్* ను అనుసరించి
శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు ఆర్ లక్ష్మణరావు సూచనల మేరకు *జూన్ నెల సాధనా మాసం* సందర్భంగా మూడవ ఆదివారం తేదీ 21.06.2026 సాయంత్రం సాధన శిబిరం/స్టడీ సర్కిల్ శ్రీ సత్య సాయి భజన మండలి, ఎండాడ నందు కన్వీనర్ వెంకట రామకృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించ బడింది..ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా, సీనియర్ ఆధ్యాత్మిక కోఆర్డినేటర్ గా సిటీ సమితిలో తన సేవలు అందించి, గత 3 సంవత్సరాలు గా (జాయింట్ ఆధ్యాత్మిక కోఆర్డినేటర్, విశాఖపట్నం జిల్లా) లో సేవలు అందిస్తున్న బి వి రమణ (గాయత్రీ కాలేజ్) భక్తులు ను ఆకట్టుకునే విధంగా తన ఆధ్యాత్మిక ప్రసంగాన్ని కొనసాగించారు.తదనంతరం ముఖ్య వక్తకు మందిరం కోఆర్డినేటర్లు, ఇన్చార్జిలు, శాలువాతో సత్కరించి స్వామి వారి ఫోటో స్వీట్లు బహుకరించారు.ఈ కార్యక్రమం లో మందిరం ఇన్చార్జి కృష్ణారావు, గ్రూప్ లీడర్ అప్పల నాయుడు,ఆధ్యాత్మిక కోఆర్డినేటర్ రామచంద్రరావు, బాల వికాస్ ఇన్చార్జిలు (రఘునందన రాజు,శ్యామల,గోపి ? అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.