తేదీ 29-6-2026,ఈ దినం సోమవారం ఉదయం 7.15 నిమిషాలకు విశాఖపట్నం జిల్లా వి 201ఏ ,వాసవి క్లబ్ విక్టరీ అరిలోవ మరియు ఆర్య వైశ్య సంఘం,అరిలోవ వార్ల ఆధ్వర్యం లో అరిలోవ లో ఆర్య వైశ్యుల కుల దైవం శ్రీ శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి నూతనంగా నిర్మిస్తున్న ఆలయం లో శక్తి స్వరూపిణీ శ్రీ శ్రీ శ్రీ వాసవి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అంతర్జాతీయ అధ్యక్షులు వాసవియన్ సేవ సంకల్ప*కె . సి.జి.ఎఫ్
సిద్ధా వేంకట సూర్యప్రకాశరావు, జిల్లా గవర్నర్ వాసవియన్ విద్యా సంకల్ప *కె .సి.జి.ఎఫ్. శ్రేయోభిలాషి వంకాయల సాయి నిర్మలా మరియు జిల్లాలో గల నాయకుల చేతుల మీదుగా అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఎంతో వైభవంగా జరిగినది.
ఈ కార్యక్రమం నకు ముఖ్య అతిథిగా ఏం.ఎల్.ఏ. శ్రీ వెలగపూడి రామకృష్ణ బాబు గారు విచ్చేసి వాసవి మాత ఆశీస్సులు పొందారు. జిల్లా నాయకులు రామకృష్ణ బాబు గారు చేసిన మహోపకారానికి అనేక వేల ధన్యవాదములు తెలిపారు. అలాగే అంతర్జాతీయ వాసవి క్లబ్స్ ,జిల్లా వి201ఏ, జిల్లా నాయకులు, జిల్లాలో గల క్లబ్బులు, అనేకమంది దాతలు ఈ దేవాలయ నిర్మాణానికి ధన రూపేణా, వస్తు రూపేణా , ఎంతో సహాయ సహకారములు అంద చేసినందుకు ఆలయ కమిటీ వారు కృతజ్ఞతలు తెలిపారు. మన విశాఖ జిల్లాకు కావలసిన సదుపాయాలు కల్పిస్తామని మీటింగ్ లో అంతర్జాతీయ అధ్యక్షులు హామీ ఇచ్చేరు. ఈ కార్యక్రమం నకు డిస్ట్రిక్ట్ లో ఉన్న క్లబ్ అధ్యక్షులు,నాయకులు, సభ్యులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేసినారు.